News March 29, 2024
RCBvsKKR: 2019 సీన్ రిపీటవుతుందా?

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే RCBvsKKR మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడిన RCB ఒకటి ఓడిపోయి మరొకటి గెలిచింది. KKRకి ఇది రెండో మ్యాచ్ కాగా మొదటిది గెలుపొందింది. అయితే, ఈ మ్యాచ్‌లో KKR ప్లేయర్ రస్సెల్ మరోసారి విధ్వంసం సృష్టిస్తారా? అనేదానిపై నెట్టింట చర్చ జరుగుతోంది. 2019లో ఇదే స్టేడియంలో RCB గెలిచే మ్యాచ్‌లో రస్సెల్ 13 బంతుల్లో 48 రన్స్ చేసి KKRను గెలిపించారు.
Similar News
News January 11, 2026
నెల్లూరు: మీకు విద్యుత్ సమస్యలా.?

నెల్లూరు జిల్లా విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం “డయల్ యువర్ ఎస్ఈ” కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సూపరింటెండింగ్ ఇంజినీర్ కె.రాఘవేంద్ర తెలిపారు. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు 0861–2320427 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలను నేరుగా తెలియజేయవచ్చు. నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.
News January 11, 2026
లేట్ కాకముందే డీల్ చేసుకోండి.. క్యూబాకు ట్రంప్ హెచ్చరిక

క్యూబాకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. తమతో వీలైనంత త్వరగా ఒప్పందం కుదుర్చుకోవాలని స్పష్టం చేశారు. ‘ఇకపై క్యూబాకు ఆయిల్ లేదా డబ్బు వెళ్లదు. ఆలస్యం కాకముందే డీల్ చేసుకోవాలని సూచిస్తున్నా. వెనిజులా నుంచి వస్తున్న ఆయిల్, డబ్బుతో చాలా ఏళ్లు క్యూబా బతికింది. అందుకు బదులుగా వెనిజులాకు సెక్యూరిటీ సర్వీసెస్ అందించింది. ఇకపై అలా జరగబోదు’ అని ట్రూత్ సోషల్‌లో రాసుకొచ్చారు.
News January 11, 2026
కోహ్లీ సెంచరీ మిస్

స్టార్ క్రికెటర్ కోహ్లీ త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నారు. న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో 91 బంతుల్లో 93 పరుగులు చేసి ఔటయ్యారు. జెమీసన్ బౌలింగ్‌లో బ్రేస్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. దీంతో కింగ్ నుంచి మరో సెంచరీ చూడాలనుకున్న ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. విరాట్ ఔటయ్యే సమయానికి భారత్ స్కోర్ 234/3. టీమ్ ఇండియా విజయానికి 64 బంతుల్లో 67 రన్స్ అవసరం.


