News February 17, 2025

RCBW టార్గెట్ 142

image

WPLలో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్, ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్ జట్లు వడోదరాలో తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 19.3 ఓవర్లకు 141పరుగులు చేసి ఆలౌటైంది. రోడ్రిగ్స్ 34 రన్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచారు. RCBW బౌలర్లు రేణుకా సింగ్, వరేహం మూడు వికెట్లు తీయడంతో తక్కువ స్కోర్‌కే ఢిల్లీ పరిమితమైంది. 142 పరుగుల లక్ష్యంతో RCBW ఓపెనర్లు స్మృతి మంథాన, యాట్ హాడ్జ్ బ్యాటింగ్‌కు దిగారు.

Similar News

News January 7, 2026

ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్లు కొట్టివేత

image

TG: నాంపల్లి కోర్టులో ఐబొమ్మ రవికి బిగ్ షాక్ తగిలింది. 5 కేసుల్లో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం కొట్టేసింది. అతడికి విదేశాల్లో పౌరసత్వం ఉందని, బెయిల్ ఇస్తే దేశం దాటి పోయే అవకాశం ఉందని పోలీసులు వాదించారు. వారి వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం రవి బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది.

News January 7, 2026

RARE: పర్ఫెక్ట్ ఫిబ్రవరి.. గమనించారా?

image

వచ్చే ఫిబ్రవరి నెలను ‘పర్ఫెక్ట్ ఫిబ్రవరి’గా నెటిజన్లు అభివర్ణిస్తున్నారు. ఆ నెల ఆదివారంతో మొదలై సరిగ్గా 28 రోజులు పూర్తి చేసుకుని శనివారంతో ముగియనుంది. అంటే ఎక్కడా మిగిలిపోకుండా కచ్చితంగా 4 వారాల కాలచక్రాన్ని కలిగి ఉండటం విశేషం. చివరిసారిగా 2015లో ఇలానే జరిగింది. క్యాలెండర్‌లో నెలంతా ఒక క్రమ పద్ధతిలో సెట్ అవ్వడంతో దీనిపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మీరూ ఇది గమనించారా? COMMENT

News January 7, 2026

తెలుగులో ఛార్జ్‌‌షీట్.. పోలీసు శాఖలో సరికొత్త అధ్యాయం

image

TG: పోలీస్ దర్యాప్తు, కోర్టు పత్రాల సమర్పణ అంతా ఇంగ్లిష్‌లోనే ఉంటుంది. దీంతో అటు బాధితులు, ఇటు నిందితులకు అందులోని అంశాలు అర్థం కాక ఇబ్బందులు పడుతుంటారు. ఈ పరిస్థితుల్లో దుండిగల్ PS​లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ స్వరూప తెలుగులో 2 ఛార్జ్‌‌షీట్లు దాఖలు చేసి పోలీస్ శాఖలో సరికొత్త ఒరవడికి నాంది పలికారు. తాజాగా డీజీపీ శివధర్ రెడ్డి, ఐపీఎస్ శిఖా గోయల్ ఆమెకు ప్రశంసా పత్రం అందజేశారు.