News February 5, 2025
RCPM: అద్దెకొచ్చామంటూ.. బంగారం గొలుసు చోరీ

రామచంద్రపురం పట్టణం ఏడో వార్డు గణేష్ నగర్‌లో నివాసం ఉంటున్న మహిళ కడియాల పార్వతమ్మ మెడలో గొలుసును మాస్కు ధరించిన ఆగంతకుడు మంగళవారం తస్కరించాడు. అద్దె ఇల్లు పేరుతో ఇంట్లోకి వచ్చిన ఆ వ్యక్తి ఈ దొంగతనానికి పాల్పడినట్లు పార్వతి చెప్తున్నారు. విషయం తెలిసిన వెంటనే ఎస్ఐ నాగేశ్వరరావు ఘటనా స్థలానికి వెళ్లారు. ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పార్వతమ్మను సీఐ వెంకటనారాయణ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Similar News
News December 27, 2025
రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం అందుకున్న మదనపల్లె విద్యార్థిని

మదనపల్లె జవహర్ నవోదయ విద్యాలయం కామర్స్ విభాగంలో 12వ తరగతి చదువుచున్న విద్యార్థిని శివాని ప్రధానమంత్రి జాతీయ బాల పురస్కారానికి ఎంపికైంది. 26వ తేదిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా విద్యార్థిని అవార్డు అందుకుంది. జావెలిన్ త్రో, షాట్ పుట్‌లో ప్రతిభను గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. శివాని 2023 గుజరాత్ లోను 2024లో బెంగుళూరులో జరిగిన పారా జాతీయ క్రీడల్లో జావలిన్ త్రో ప్రతిభను కనబరిచింది.
News December 27, 2025
KNR: ముదిరాజ్ సర్పంచ్ల సన్మాన పోస్టర్ ఆవిష్కరణ

ఈ నెల 30న హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించనున్న ముదిరాజ్ సర్పంచ్ల సన్మాన కార్యక్రమ పోస్టర్‌ను కరీంనగర్‌లో శనివారం ఆవిష్కరించారు. మన ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు సిద్ధి సంపత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంద నగేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికైన ముదిరాజ్ ప్రజాప్రతినిధులను గౌరవించుకోవడం ద్వారా రాజకీయ చైతన్యం పెంచడమే లక్ష్యమని వారు పేర్కొన్నారు.
News December 27, 2025
బొకేలు వద్దు.. పేద విద్యార్థులకు ‘చేయూత’ ఇవ్వండి: కలెక్టర్

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపే వారు, ఆ ఖర్చును సంక్షేమ హాస్టల్ విద్యార్థుల కోసం వెచ్చించాలని జిల్లా కలెక్టర్ షామ్మోహన్ కోరారు. జిల్లాలోని 100 ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో చదువుతున్న 15వేల మంది పేద విద్యార్థులకు పుస్తకాలు, దోమతెరలు లేదా ఇతర వసతుల కల్పనకు విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆడంబరాలకు బదులు పేద విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పడాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు.


