News February 9, 2025
RCPM: అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి

కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రామచంద్రపురం పట్టణం టీడీపీ ఆఫీస్లో నియోజవర్గ ప్రజల నుంచి అభ్యర్థులను స్వీకరించారు. ఈ సందర్భంగా నియోజవర్గ పరిధిలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు మంత్రికి అర్జీలు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సమస్యలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అర్జీదారులకు తప్పనిసరిగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అధికారుల వెంటనే సమ్యలపై పనిచేయాలన్నారు. నాయకులు పాల్గొన్నారు.
Similar News
News November 22, 2025
శైలజానాథ్కు YS జగన్ ఫోన్

శింగనమల వైసీపీ ఇన్ఛార్జి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ తల్లి సాకే గంగమ్మ మరణంపై పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. శైలజానాథ్కు శుక్రవారం రాత్రి ఫోన్ చేసి పరామర్శించారు. ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గంగమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.
News November 22, 2025
తిరుపతి: యువకుడి జోబిలో పేలిన ఫోన్

తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం చిట్టత్తూరు పంచాయతీ కొత్త కండ్రిగకు చెందిన నరసింహారెడ్డి(36) పిడుగుపాటుకు గురైన విషయం విధితమే. నరసింహారెడ్డి తన పొలంలో కూలీల చేత వరినాట్లు నాటించాడు. వర్షం వస్తుండడంతో గొడుగు వేసుకుని నిలబడి ఉండగా సమీపంలోనే పిడుగు పడింది. దీంతో అతని ఫ్యాంట్లోని ఫోన్ పేలింది. తొడ భాగం పూర్తిగా కాలిపోవడంతో మెరుగైన చికిత్స కోసం వేలూరు హాస్పిటల్కు తరలించారు. వర్షంలో తస్మాత్ జాగ్రత్త.
News November 22, 2025
MDK: రూ.లక్ష ఆదాయం వస్తుంది..!

సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా మల్బరీ తోటల సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. పట్టుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, రైతులు కొద్దిగా కష్టపడితే ఎకరానికి రూ.లక్ష వరకు ఆదాయం వస్తుందని చెప్పారు. ప్రభుత్వాలు అందిస్తోన్న ప్రోత్సాహకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ సోమేశ్వర్ రావు తెలిపారు.


