News February 9, 2025
RCPM: అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి

కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రామచంద్రపురం పట్టణం టీడీపీ ఆఫీస్‌లో నియోజవర్గ ప్రజల నుంచి అభ్యర్థులను స్వీకరించారు. ఈ సందర్భంగా నియోజవర్గ పరిధిలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు మంత్రికి అర్జీలు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సమస్యలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అర్జీదారులకు తప్పనిసరిగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అధికారుల వెంటనే సమ్యలపై పనిచేయాలన్నారు. నాయకులు పాల్గొన్నారు.
Similar News
News April 11, 2026
ఉమ్మడి విశాఖలో ఐటీ, పరిశ్రమలకు బూస్ట్

ఉమ్మడి విశాఖలో పరిశ్రమల అభివృద్ధికి మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. అదానీ ఇన్‌ఫ్రా, రైడెన్ ఇన్ఫోటెక్, TCSలకు భూములపై పూర్తి హక్కులు కల్పిస్తూ సేల్‌డీడ్‌కు అనుమతినిచ్చింది. పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు గడువు పొడిగించింది. కొత్తగా క్రెడన్స్ రియాల్టీ, ఫ్యుజీ సాఫ్ట్‌వేర్, శ్రీటెక్ డేటా, ఐస్ర్పౌట్ సంస్థలకు భూములు కేటాయించింది. ఆర్సెలర్ మిట్టల్ ప్లాంట్ విస్తరణకు పచ్చజెండా ఊపింది.
News April 11, 2026
సీజ్‌ఫైర్.. బియ్యం ధరలకు రెక్కలు!

పశ్చిమాసియాలో శాంతి చర్చలు బియ్యం ధరలకు రెక్కలు తెచ్చాయి. అమెరికా-ఇరాన్ మధ్య సీజ్‌ఫైర్‌తో అరబ్ దేశాల నుంచి ఎక్స్‌పోర్ట్ ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. దీంతో గత 2 రోజుల్లోనే బియ్యం హోల్ సేల్ ధరలు 7% పెరిగాయి. ముంద్రా, కాండ్లా పోర్టుల ద్వారా సోమవారం నుంచి భారీగా ఎగుమతులు ప్రారంభం కానున్నాయి. వచ్చే 15 రోజుల్లో రిటైల్ మార్కెట్లోనూ బియ్యం ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
News April 11, 2026
శ్రీకృష్ణుడికి ఇష్టమైన ఈ ప్రసాదాన్ని శనివారం రోజున నైవేద్యంగా పెడితే..?

శ్రీకృష్ణుడికి అటుకుల ప్రసాదమంటే ఎంతో ఇష్టమని పండితులు చెబుతున్నారు. శనివారం ఆయనకు అటుకులు, అన్నం, బెల్లం, కొబ్బరి తురుము కలిపి నైవేద్యంగా పెడితే అప్పుల బాధలు తొలగి, ఇంట్లో ధనవృద్ధి, సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్ముతారు. తేనె కలిపిన అటుకుల అన్నాన్ని ఆయనకు నివేదించి, ఆ ప్రసాదాన్ని నలుగురికి పంచితే.. సంకటాలన్నీ హరించుకుపోతాయని విశ్వసిస్తారు. పెళ్లి కాని అమ్మాయిలకు సుగుణాల భర్త వస్తాడని నమ్మకం.


