News March 16, 2025
RCPM: కిలో చికెన్ ఎంతంటే?

రామచంద్రపురం మండలంలో ఆదివారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. లైవ్ కేజీ రూ.110, బాయిలర్ కేజీ రూ. 200, ఫారం కేజీ రూ. 180, స్కిన్ లెస్ (బాయిలర్) కేజీ రూ.220కి విక్రయిస్తున్నట్లు చోడవరం బైపాస్ వద్ద చికెన్ అమ్మకదారులు తెలిపారు. పరిశుభ్రమైన వాతావరణంలో విక్రయాలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు కూడా చికెన్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు పేర్కొన్నారు. అమ్మకాలు పుంజుకున్నట్లు తెలిపారు.
Similar News
News February 12, 2026
ఇందిరమ్మ ఇళ్లు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను గడువులోగా పూర్తి చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను, లబ్ధిదారులను ఆదేశించారు. గురువారం బెల్లంపల్లి డివిజన్‌లోని పలు గ్రామాల్లో పర్యటించిన ఆయన, నిర్మాణ దశలో ఉన్న ఇళ్లను పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులను ఎప్పటికప్పుడు జమ చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
News February 12, 2026
CEERIలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

CSIR-సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(<
News February 12, 2026
మాతా, శిశు మరణాల నివారణకు సమన్వయం అవసరం: కలెక్టర్

జిల్లాలో మాతా, శిశు మరణాలను పూర్తిగా నివారించేందుకు వైద్యులు, ఐసీడీఎస్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. ఏలూరు గౌతమీ సమావేశపు హాలులో గురువారం మాతా, శిశు మరణాల నివారణపై జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో అధికారులు, వైద్యులతో సమీక్షించారు. గత సంవత్సరం 3 మాతృ మరణాలు, 36 శిశు మరణాలు సంభవించాయని, జరిగిన ప్రతి మరణంపై సవివరమైన మెడికల్ ఆడిట్ జరగాలన్నారు.


