News March 18, 2025
RCPM: చెట్టును ఢీకొన్న బైక్.. యువకుడి మృతి

రామచంద్రపురం మండలం తాళ్లపొలం వద్ద బీరు ఫ్యాక్టరీ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాయవరం మండలం వెంటూరుకు చెందిన యర్రగంటి శ్రీదత్త (28) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. రామచంద్రపురం నుంచి తాళ్లపొలం వైపు వెళ్తూ బీరు ఫ్యాక్టరీ దాటిన తర్వాత చెట్టును ఢీకొట్టాడు. గాయాలైన అతడిని రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ద్రాక్షారామం పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News February 23, 2026
NZB: రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్‌లో హరీశ్ తేజకు సిల్వర్ మెడల్

తెలంగాణ రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన హరీశ్ తేజ సిల్వర్ మెడల్ సాధించాడు. హైదరాబాద్‌లోని లాల్ బహదూర్ స్టేడియంలో జరిగిన సీఎం కప్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 65 కేజీల కేటగిరిలో హరీశ్ తేజ కోచ్ రాజ్ కుమార్ సహకారంతో స్నాచ్‌లో 96, క్లీన్ అండ్ జెర్క్‌లో 111 కేజీల బరువెత్తి మొత్తం 207 కేజీల బరువుతో ద్వితీయ స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ అందుకున్నాడు.
News February 23, 2026
కల్తీ పాల ఘటన.. నరసాపురంలో ఉన్నతాధికారుల పర్యటన

రాజమండ్రిలో నమోదైన ఆక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ ఘటన నేపథ్యంలో కోరుకొండ మండలం నరసాపురం గ్రామాన్ని ఆరోగ్య శాఖ కమిషనర్ జి.వీర పాండ్యన్, కలెక్టర్ కీర్తి చేకూరి, డీఐజీ అశోక్ కుమార్ సోమవారం పర్యటించారు. తాగునీరు, పాలు, ఆహార పదార్థాల నమూనాలను సేకరించి పరీక్షలకు పంపినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని వారు స్పష్టం చేశారు.
News February 23, 2026
ఆలస్యంగా నిద్రపోతే..

ఆరోగ్యంగా ఉండేందుకు డైట్, వ్యాయామంతోపాటు నిద్ర కూడా ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. ఒకే టైమ్‌లో నిద్రపోని, 11PM వరకు మేల్కొనే వారు బరువు తగ్గడంలో ఇబ్బంది పడతారని చెబుతున్నారు. ‘10.30PM తర్వాత జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. ఈ సమయంలో మేల్కొంటే శరీరం ఒత్తిడికి గురవుతుంది. ఆకలిని నియంత్రించే హార్మోన్లు ప్రభావితమవుతాయి. ఇది బరువుపై ప్రభావం చూపుతుంది. అజీర్ణం, ఉబ్బరం సమస్యలొస్తాయి’ అని హెచ్చరిస్తున్నారు.


