News February 5, 2025
RCPM: అద్దెకొచ్చామంటూ.. బంగారం గొలుసు చోరీ

రామచంద్రపురం పట్టణం ఏడో వార్డు గణేష్ నగర్‌లో నివాసం ఉంటున్న మహిళ కడియాల పార్వతమ్మ మెడలో గొలుసును మాస్కు ధరించిన ఆగంతకుడు మంగళవారం తస్కరించాడు. అద్దె ఇల్లు పేరుతో ఇంట్లోకి వచ్చిన ఆ వ్యక్తి ఈ దొంగతనానికి పాల్పడినట్లు పార్వతి చెప్తున్నారు. విషయం తెలిసిన వెంటనే ఎస్ఐ నాగేశ్వరరావు ఘటనా స్థలానికి వెళ్లారు. ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పార్వతమ్మను సీఐ వెంకటనారాయణ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Similar News
News February 22, 2026
కామారెడ్డి, బాన్సువాడలో 163 సెక్షన్: SP

శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు బాన్సువాడలో 163 BNSS (పాత సెక్షన్ 144) అమలు చేస్తున్నట్లు ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది గుమికూడటం, ఆయుధాలు ధరించడం నిషేధమని హెచ్చరించారు. అయితే, పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, పోలీసు విధి నిర్వహణ, అత్యవసర వైద్య సేవలకు ఈ ఆంక్షల నుండి మినహాయింపు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
News February 22, 2026
మెదక్ జిల్లాలో ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ని పెద్ద శంకరంపేట పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాన్సువాడలో జరుగుతున్న నిరసన కార్యక్రమానికి మద్దతుగా రాజాసింగ్ హైదరాబాద్ నుంచి బాన్సువాడ బయలుదేరారు. ఈ క్రమంలో ఆయనను బాన్సువాడకు వెళ్లకుండా ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రాజాసింగ్ అరెస్ట్‌ను మండల బీజేపీ నాయకులు ఖండిస్తున్నారు.
News February 22, 2026
మాజీ భార్య, కుమారుడికి పాండ్య ఖరీదైన గిఫ్ట్!

మాజీ భార్య నటాషా, కుమారుడు అగస్త్యకు ఆల్‌రౌండర్ హార్దిక్ <<19182059>>పాండ్య<<>> కాస్ట్లీ ల్యాండ్‌రోవర్ డిఫెండర్ కారు గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీని విలువ రూ.4 కోట్లు. కొంతకాలం క్రితం నటాషాకు విడాకులు ఇచ్చిన పాండ్య.. ఆమెతో పాటు కొడుకు బాగోగులు చూసుకుంటున్నట్లు సమాచారం. ఈక్రమంలోనే వీరిద్దరికీ కారు కొనిచ్చారట. నటాషా, అగస్త్య కారు షోరూమ్‌లో దిగిన ఫొటోల్లో ‘పాపా టు అగస్త్య’ అని రాసి ఉన్న బోర్డు కనిపిస్తోంది.


