News March 9, 2025
RCPM: కిలో చికెన్ ఎంతంటే?

రామచంద్రపురం మండలంలో ఆదివారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. లైవ్ కేజీ రూ.110, బాయిలర్ కేజీ రూ. 200, ఫారం కేజీ రూ. 180, స్కిన్ లెస్ (బాయిలర్) కేజీ రూ.220కి విక్రయిస్తున్నట్లు చోడవరం బైపాస్ వద్ద వ్యాపారులు తెలిపారు. పరిశుభ్రమైన వాతావరణంలో విక్రయాలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు చికెన్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడంతో అమ్మకాలు పుంజుకున్నాయి. మరి మీ ప్రాంతంలో ఎంతో కామెంట్ చేయండి.
Similar News
News March 9, 2025
గరిమెళ్లకు ప్రముఖుల నివాళులు

AP: TTD ఆస్థాన గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మృతి పట్ల CM చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. 600లకు పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. కర్ణాటక సంగీతం, లలిత సంగీతం, జానపద సంగీతంలో తమదైన ముద్ర వేసిన గరిమెళ్ల మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటని మంత్రి లోకేశ్ అన్నారు. ప్రముఖ శాస్త్రీయ సంగీత గాయకుడైన గరిమెళ్ల ఆత్మకు శాంతి చేకూరాలని మాజీ CM జగన్ ట్వీట్ చేశారు.
News March 9, 2025
రాజాం: ఎమ్మెల్సీ అభ్యర్థిగా కావలి గ్రీష్మ

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను టీడీపీ ఆదివారం ప్రకటించింది. రాష్ట్రంలోని 3 ప్రాంతాల నుంచి ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేసింది. ఇందులో రాజాం నియోజకవర్గం సంతకవిటి మండలం కావలి గ్రామానికి చెందిన కావలి గ్రీష్మను ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించారు. మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతీ కుమార్తె గ్రీష్మ. ప్రస్తుతం ఈమె ఏపీ మహిళా సహకార ఆర్థిక సంస్థ ఛైర్‌పర్సన్‌గా పనిచేస్తున్నారు.
News March 9, 2025
పెళ్లి పీటలెక్కబోతున్న నటి అభినయ

సినీ నటి అభినయ నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టా వేదికగా ప్రకటించారు. కాబోయే భర్తతో గుడి గంట కొడుతున్న ఫొటోను షేర్ చేశారు. అతని ముఖాన్ని మాత్రం చూపించలేదు. ‘చిన్ననాటి స్నేహితుడితో రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. మాది 15 ఏళ్ల బంధం’ అని ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దివ్యాంగురాలైన (మూగ, చెవిటి) అభినయ తెలుగులో శంభో శివ శంభో, ఢమరుకం, దమ్ము, SVSC వంటి సినిమాలతో పాపులరైన సంగతి తెలిసిందే.