News March 18, 2025
RCPM: చెట్టును ఢీకొన్న బైక్.. యువకుడి మృతి

రామచంద్రపురం మండలం తాళ్లపొలం వద్ద బీరు ఫ్యాక్టరీ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాయవరం మండలం వెంటూరుకు చెందిన యర్రగంటి శ్రీదత్త (28) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. రామచంద్రపురం నుంచి తాళ్లపొలం వైపు వెళ్తూ బీరు ఫ్యాక్టరీ దాటిన తర్వాత చెట్టును ఢీకొట్టాడు. గాయాలైన అతడిని రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ద్రాక్షారామం పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News December 10, 2025
విద్యావ్యాప్తితో జిల్లా పేరును నిలపాలి: కలెక్టర్

విద్యావ్యాప్తి ద్వారా జిల్లా పేరు ప్రఖ్యాతులను రాష్ట్ర స్థాయిలో ఇనుమడింపజేయాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, విద్యాశాఖ అధికారి పడాల నాగేశ్వరరావుకు సూచించారు. బుధవారం ఇన్‌ఛార్జి DEOగా బాధ్యతలు చేపట్టిన నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలెక్టర్ ను కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ DEOకు పలు సూచనలు చేశారు. జిల్లా విద్యావ్యవస్థకు దార్శనిక నాయకత్వం వహించి దిక్సూచిలా పనిచేయాలని ఆయన సూచించారు.
News December 10, 2025
సంగారెడ్డి: 18 నుంచి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు

సంగారెడ్డి జిల్లాలో ఈనెల 18 నుంచి 23వ తేదీ వరకు స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. 18, 19 తేదీల్లో ప్రాథమిక ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. రోజుకు 50 శాతం చొప్పున ఉపాధ్యాయులు హాజరుకావాలని పేర్కొన్నారు. 21, 23 తేదీల్లో ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు.
News December 10, 2025
విజయవాడలో మెడికల్ క్యాంపుల సిద్ధం

భవాని దీక్షాపరుల ఆరోగ్య సంరక్షణ కోసం అవసరమైన మందులు, వైద్యులతో కలిసి మొత్తం 28 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. రాజగోపురం, ఓం టర్నింగ్, ఫస్ట్ ఎయిడ్ సెంటర్, మహామండపం, కనకదుర్గనగర్, దుర్గా ఘాట్, పున్నమి ఘాట్, సీతమ్మవారి పాదాలు, రైల్వే స్టేషన్, బస్‌స్టాండ్‌లో శిబిరాలు ఉన్నాయి. దేవస్థానం అంబులెన్సులకు అదనంగా కొండపైన, కొండ దిగువన, గిరిప్రదక్షిణ మార్గంలో 10 అంబులెన్సులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.


