News April 12, 2024
ఆ పరీక్షను మళ్లీ నిర్వహించండి: హైకోర్టు

TG: గురుకులాల్లో ఆర్ట్ టీచర్ పోస్టుల భర్తీకి మరోసారి నియామక పరీక్ష నిర్వహించాలని TREI-RBను హైకోర్టు ఆదేశించింది. ఇంగ్లిష్‌తో పాటు తెలుగులో పరీక్ష పేపర్ ఇవ్వాలని స్పష్టం చేసింది. నోటిఫికేషన్‌లో తెలుగు, ఇంగ్లిష్‌లో పరీక్ష ఉంటుందని పేర్కొని, కేవలం ఇంగ్లిష్‌లోనే పరీక్షను నిర్వహించడంపై పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. దీంతో పరీక్షను మళ్లీ నిర్వహించాలని ధర్మాసనం తీర్పునిచ్చింది.
Similar News
News October 25, 2025
సౌదీకి సైన్యాన్ని అద్దెకివ్వనున్న పాకిస్థాన్

ఇటీవల పాకిస్థాన్, సౌదీ మధ్య రక్షణ ఒప్పందం కుదరడం తెలిసిందే. ఎవరు దాడి జరిపినా ఇరు దేశాలూ ఎదుర్కోవాలని నిర్ణయించాయి. అయితే దీనిలో అసలు రహస్యం పాకిస్థాన్ తన సైన్యాన్ని అద్దెకు ఇవ్వనుండడం. 25వేల మంది సైనికుల్ని పాక్ సౌదీకి పంపనుంది. దానికి ప్రతిగా సౌదీ ₹88వేల CR ప్యాకేజీని పాక్‌కు అందిస్తుంది. పాక్ ఇప్పటికే రాజకీయ, ఆర్థిక సంక్షోభంతో అనేక రుణాలు తీసుకుంటోంది. అవీ సరిపోక ఈ అద్దె విధానాన్ని ఎంచుకుంది.
News October 25, 2025
భారత్ త్రిశూల విన్యాసాలు.. పాక్ నోటమ్ జారీ

పాక్ బార్డర్‌లోని సర్ క్రీక్ ప్రాంతంలో ఈనెల 30 నుంచి NOV 10 వరకు భారత త్రివిధ దళాలు త్రిశూల సైనిక విన్యాసాలు నిర్వహించనున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న భారత్ NOTAM జారీ చేసింది. దీంతో పాక్ కూడా తమ సెంట్రల్, సదరన్ ఎయిర్‌స్పేస్‌లలో విమానాల రాకపోకలను రద్దు చేస్తూ నోటమ్ జారీ చేసింది. ఇందుకు ప్రత్యేకంగా కారణాలేవీ వెల్లడించలేదు. కాగా త్రిశూల విన్యాసాల వెనుక భారత వ్యూహమేంటని తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
News October 25, 2025
ఆస్ట్రేలియా ఆలౌట్.. భారత్ టార్గెట్ ఎంతంటే?

భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో AUS 236 రన్స్‌కు ఆలౌట్ అయింది. 124-2తో పటిష్ఠ స్థితిలో ఉన్న కంగారూలు భారత బౌలర్ల ధాటికి కుప్పకూలారు. మార్ష్ 41, హెడ్ 29, షార్ట్ 30, రెన్షా 56, క్యారీ 24, కూపర్ 23 రన్స్ చేశారు. మన బౌలర్లలో రాణా 4, సుందర్ 2, సిరాజ్, అక్షర్, ప్రసిద్ధ్, కుల్దీప్ తలో వికెట్ పడగొట్టారు. కాసేపట్లో 237 టార్గెట్‌తో భారత్ బరిలోకి దిగనుంది. IND వైట్‌వాష్ నుంచి తప్పించుకుంటుందా? COMMENT


