News October 23, 2024

భూముల రీ-సర్వే.. గ్రామసభల్లో 41వేల ఫిర్యాదులు

image

AP: భూములపై రీ-సర్వే నిర్వహిస్తున్న గ్రామ సభల్లో ఇప్పటి వరకు 41,112 ఫిర్యాదులు అందాయి. భూ విస్తీర్ణాల తగ్గింపు, పత్రాల్లో తప్పులు, చనిపోయిన వారి పేర్ల ముద్రింపు వంటి సమస్యలు అధికారుల దృష్టికి వచ్చాయి. గత ప్రభుత్వం రీ-సర్వే చేసి 6,860 గ్రామాల్లో 21లక్షల హక్కు పత్రాలు పంపిణీ చేసింది. ఇందులో 25-30% మేర తప్పులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. వీటిని సరిదిద్దేందుకు సమయం పడుతుందని మంత్రి అనగాని తెలిపారు.

Similar News

News October 23, 2024

చలి మొదలైంది..

image

తెలుగు రాష్ట్రాల్లో చలి మొదలైంది. తెల్లవారుజామున, లేట్ నైట్స్ చలిగాలులు వీస్తున్నాయి. దీంతో ప్రజలు ఉన్ని దుస్తులు ధరించి చలి నుంచి రక్షణ పొందాలని నిపుణులు సూచిస్తున్నారు. వాతావరణ మార్పుల వల్ల జ్వరాల బారినపడే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. మరోవైపు తుఫాన్ ప్రభావంతో ఇరు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇక మధ్యాహ్నం సమయంలో ఎండ దంచుతోంది. దీంతో భిన్నమైన వాతావరణం ఉంటోంది.

News October 23, 2024

రైతుల సమస్యలపై ఎల్లుండి నుంచి ఆందోళనలు

image

TG: అన్నదాతల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో ఈ నెల 25 నుంచి 31 వరకు అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఆందోళనలకు పిలుపునిచ్చింది. రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రూ.2లక్షల రుణమాఫీ చేయాలని, అన్ని రకాల పంటలకు ₹500 బోనస్ చెల్లించాలని, 58 ఏళ్లు దాటిన ప్రతి రైతు, వ్యవసాయ కార్మికులకు ఏడాదికి ₹10వేల పెన్షన్ ఇవ్వాలని కోరింది. అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో జరిగే ఆందోళనల్లో రైతన్నలు పాల్గొనాలని పిలుపునిచ్చింది.

News October 23, 2024

బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలకు వెబ్ ఆప్షన్ల నమోదు ప్రారంభం

image

AP: బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో కన్వీనర్ కోటా ప్రవేశాలకు వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 25వ తేదీ రాత్రి 9గంటల్లోగా విద్యార్థులు ఆప్షన్లు నమోదు చేసుకోవాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ తెలిపింది. ఆప్షన్ల నమోదులో సాంకేతిక సమస్యలు తలెత్తితే 9000780707, 8008250842 నంబర్లను సంప్రదించాలని రిజిస్ట్రార్ రాధికారెడ్డి తెలిపారు.