News October 22, 2024

లద్దాక్ విషయంలో భారత్‌తో ఒప్పందానికి వచ్చాం: చైనా

image

తూర్పు లద్దాక్ సరిహద్దు వివాదానికి ముగింపు పలికేలా భారత్‌తో ఒప్పందానికి వచ్చినట్లు చైనా ప్రకటించింది. ‘సరిహద్దు సమస్యలకు సంబంధించి దౌత్య, సైనికపరమైన విధానాల్లో భారత్‌తో చర్చించాం. తాజాగా ఇరు పక్షాలు ఓ పరిష్కారానికి వచ్చాయి’ అని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ తెలిపారు. గడచిన నాలుగేళ్లుగా తూర్పు లద్దాక్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి భారత్, చైనా మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.

Similar News

News October 22, 2024

పొలిటికల్ బాసులు పోలీసులకు స్వేచ్ఛనివ్వాలి: KTR

image

TG: రాష్ట్రంలో శాంతిభద్రతలు తీవ్ర ఆందోళనకరంగా మారాయని KTR అన్నారు. గత కొన్ని నెలలుగా తాము చెబుతున్నదే ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్సీ <<14422586>>జీవన్ రెడ్డి<<>> చెప్పారని Xలో పేర్కొన్నారు. హోం మినిస్టర్ లేకపోవడం, పోలీసులు రాజకీయ వ్యవహారాల్లో బిజీగా ఉండడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఇప్పటికైనా పొలిటికల్ బాసులు పోలీసులకు స్వేచ్ఛనివ్వాలని, పోలీసులు శాంతిభద్రతలను కాపాడటంపై దృష్టి పెట్టాలని KTR కోరారు.

News October 22, 2024

మోస్ట్ పాపులర్ హీరోయిన్‌గా సమంత

image

SEP నెలకుగాను మోస్ట్ పాపులర్ హీరోగా దళపతి విజయ్ నిలిచినట్లు ORMAX MEDIA వెల్లడించింది. ఆ తర్వాత వరుసగా ప్రభాస్, షారుఖ్, అజిత్ కుమార్, NTR, అల్లు అర్జున్, మహేశ్ బాబు, అక్షయ్ కుమార్, రామ్ చరణ్, సల్మాన్ ఉన్నారంది. హీరోయిన్లలో సమంత అగ్రస్థానంలో ఉన్నట్లు తెలిపింది. ఆ తర్వాత ఆలియా భట్, దీపికా పదుకొణె, నయనతార, త్రిశ, శ్రద్ధా కపూర్, కాజల్ అగర్వాల్, సాయిపల్లవి, రష్మిక, కియారా ఉన్నారని పేర్కొంది.

News October 22, 2024

ఈ నంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లకు స్పందించవద్దు: TDP

image

AP: మంత్రి నారా లోకేశ్ టీమ్ అంటూ సాయం పేరుతో ఫేక్ ఎన్నారై టీడీపీ పేర్లతో మోసగాళ్లు స్కాంలు చేస్తున్నారని టీడీపీ తెలిపింది. +1(208)6482504, 8977038602 నంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లకు స్పందించవద్దని ప్రజలకు సూచించింది. ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలంది. ఇప్పటికే ఫేక్ నంబర్లతో మోసగిస్తున్న వారిపై సైబర్ క్రైమ్ విభాగం దర్యాప్తు చేస్తోందని ట్వీట్ చేసింది.