News August 21, 2024

రియాక్టర్ పేలుడు.. ఐదుగురు మృతి

image

AP: అనకాపల్లిలోని అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన <<13908795>>ఘటనలో<<>> మృతుల సంఖ్య ఐదుకు చేరింది. కొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పేలుడు ధాటికి భారీగా మంటలు చెలరేగడంతో పలువురు కార్మికులు చిక్కుకుపోయారు. 8 అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాద సమయంలో విధుల్లో ఉన్న వారి వివరాలను యాజమాన్యం సేకరిస్తోంది.

Similar News

News November 18, 2025

పెదాలు పగులుతున్నాయా?

image

శీతాకాలంలో పెదాలు తరచూ పొడిబారి పగిలిపోతుంటాయి. ఇలా కాకుండా ఉండాలంటే వెన్న, నిమ్మరసం, దోస, టమాటా గుజ్జు పూయాలి. లిప్‌బామ్ రాయడం మర్చిపోకూడదు. రాత్రి పడుకునే ముందు నేతితో పెదాలను మర్దనా చేయడం వల్ల కూడా పెదాలు మృదువుగా ఉంటాయి. డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. నాణ్యమైన ఉత్పత్తులనే వాడాలి. అలాగే మంచి పోషకాహారం, తగినంత నిద్ర మిగతా శరీర భాగాల్లాగే పెదాలకూ అవసరం. కాబట్టి జీవనశైలి బావుండేలా చూసుకోవాలి.

కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ఉద్యోగాలు

image

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ 27 కాంట్రాక్ట్ ఆపరేటర్ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 21వరకు అప్లై చేసుకోవచ్చు. ఏడో తరగతి ఉత్తీర్ణతతో పాటు హెవీ వెహికల్ లైసెన్స్, ఉద్యోగ అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ప్రాక్టికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.200, SC,STలకు ఫీజు లేదు.