News September 5, 2025

READY.. బాలాపూర్, ఖైరతాబాద్ రూట్ ఇదే

image

HYD: ఖైరతాబాద్, బాలాపూర్ నిమజ్జన రూట్లను కలెక్టర్ హరిచంద్ర ప్రకటించారు. బాలాపూర్ గణేశ్ కట్టమైసమ్మ నుంచి కేశవగిరి, చంద్రాయణగుట్ట ఎక్స్ రోడ్, చార్మినార్, అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్, ఆబిడ్స్ జీపీయో, లిబర్టీ, అంబేద్కర్ విగ్రహం గుండా ట్యాంక్ బండ్ చేరుకుంటుంది. ఖైరతాబాద్ గణేశ్ బడా గణేశ్ నుంచి ఓల్డ్ పీఎస్ సైఫాబాద్, ఇక్బాల్ మినార్, తెలుగు తల్లి, అంబేద్కర్ విగ్రహం మీదుగా ట్యాంక్ బండ్ వెళ్తుంది.

Similar News

News September 7, 2025

HYD: టస్కర్ వాహనం కిందపడి జీహెచ్‌ఎంసీ కార్మికురాలి మృతి

image

బషీర్‌బాగ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు రేణుక(50) మృతి చెందింది. గుడిమల్కాపూర్‌కు చెందిన రేణుక 15 ఏళ్లుగా జీహెచ్ఎంసీలో పనిచేస్తుంది. ఇవాళ ఉదయం బషీర్‌బాగ్–లిబర్టీ మార్గంలో విధుల్లో ఉండగా రోడ్డు దాటే క్రమంలో ప్రమాదవశాత్తు వాహనం కిందపడింది. తలకు తీవ్రగాయం కావడంతో ఆస్పత్రికి తరలించేలోపే చనిపోయింది. పోలీసులు డ్రైవర్‌ గజానంద్‌ను అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేశారు.

వైభవంగా శ్రీ సీతారామచంద్రస్వామి నిత్యకళ్యాణం

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆదివారం నిత్యకళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. స్వామివారిని పూలమాలతో అద్భుతంగా అలంకరించి నిత్య కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. స్వామివారి కళ్యాణాన్ని దర్శించుకోవడం తమ అదృష్టంగా భావిస్తూ భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.