News May 25, 2024
ఉద్యోగాలు, అభివృద్ధిపై చర్చకు సిద్ధం: కేటీఆర్

TG: పదేళ్లుగా రాష్ట్రంలో జరిగిన ఉద్యోగాల భర్తీ, అభివృద్ధిపై తాను చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. తెలంగాణలో కంటే దేశంలో అధిక అభివృద్ధి జరిగి ఉంటే BJP, కాంగ్రెస్ సమాధానం చెప్పాలన్నారు. దీన్ని వాళ్లు నిరూపిస్తే తాను MLAగా రాజీనామా చేస్తానని, లేదంటే కాంగ్రెస్, బీజేపీ నేతలు పదవులకు రిజైన్ చేస్తారా? అని సవాల్ విసిరారు.
Similar News
News January 22, 2026
ఎండోమెంట్ వ్యవసాయేతర భూముల లీజును తప్పుబట్టిన హైకోర్టు

AP: దేవాలయ వ్యవసాయేతర భూములను సుదీర్ఘకాలం లీజుకు ఇవ్వడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఛారిటీ సంస్థలకు భూముల్ని లీజుకు ఇచ్చేలా ప్రభుత్వం తెచ్చిన జీవో నెం.15ను నిలిపివేసింది. దేవదాయ భూములను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టే అధికారం ప్రభుత్వానికి లేదని పిటిషనర్లు వాదించగా, ఇప్పటికే లీజులు పొందిన వారిని ఖాళీ చేయించడం కష్టతరంగా మారిందని AG వాదించారు. అనంతరం కోర్టు విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
News January 22, 2026
WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుంచి అధికారికంగా వైదొలిగేందుకు అమెరికా సిద్ధమైంది. ట్రంప్ 2025లో పదవిలోకి వచ్చిన తొలి రోజే ఈ విషయాన్ని ప్రకటించారు. WHO నిధుల్లో సుమారు 18% USAనే ఫండింగ్ ఇచ్చేది. అమెరికా వెళ్లిపోతే ఆ సంస్థకి భారీ ఆర్థిక సంక్షోభం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఇప్పటి వరకూ ఇవ్వాల్సిన బకాయిలు ($260M) చెల్లించకుండానే US నిష్క్రమిస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి.
News January 22, 2026
260 మృతి ఘటన.. సంచలన రిపోర్ట్!

అహ్మదాబాద్‌లో గతేడాది కుప్పకూలి 260 మంది మృతికి కారణమైన ఎయిరిండియా బోయింగ్ 787కు సంబంధించి USకు చెందిన ఓ NGO సంచలన విషయాలు వెల్లడించింది. BBC కథనం ప్రకారం.. 2014లో సర్వీసులో చేరిన ఆ విమానంలో తొలిరోజు నుంచే సమస్యలు తలెత్తినట్లు అక్కడి సెనేట్‌కు సమర్పించిన నివేదికలో పేర్కొంది. ఇంజినీరింగ్, తయారీ, క్వాలిటీ, నిర్వహణ లోపాల వల్లే ఇవి తలెత్తినట్లు ఇంటర్నల్ డాక్యుమెంట్లలో గుర్తించామని తెలిపింది.


