News February 22, 2025
హామీలు అమలు చేశాకే చర్చకు సిద్ధం: కిషన్ రెడ్డి

TG: హామీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఒక్కటి కూడా అమలు చేయలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. బోధన్లో టీచర్ ఎమ్మెల్సీ ప్రచార కార్యక్రమంలో మాట్లాడారు. ఉద్యోగాల భర్తీలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. హామీలు అమలు చేశాకే తాము చర్చకు సిద్ధమని చెప్పారు. రేవంత్ పాలనలో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
Similar News
News February 22, 2025
గ్రూప్-2 ఆందోళనల వెనుక కోచింగ్ సెంటర్లు.. APPSC సంచలన ఆరోపణ

గ్రూప్-2 నిర్వహణపై ప్రభుత్వం రాసిన లేఖకు <<15547592>>APPSC<<>> సమాధానం ఇచ్చింది. ‘మెయిన్స్కు క్వాలిఫై కాని కొందరు వాయిదా కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ రద్దు చేస్తే మరోసారి పరీక్ష రాసే ఛాన్స్ పొందాలి అనుకుంటున్నారు. అభ్యర్థుల ఆందోళనల వెనుక కోచింగ్ సెంటర్లూ ఉన్నాయి. రోస్టర్ పాయింట్ల విషయాన్ని నోటిఫికేషన్లో చెప్పలేదు. పరీక్ష సకాలంలో జరగకపోతే నిజమైన అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది’ అని పేర్కొంది.
News February 22, 2025
కర్ణాటకకు బస్ సర్వీసులు నిలిపేసిన మహారాష్ట్ర

సరిహద్దు వివాదం నేపథ్యంలో కర్ణాటకకు బస్సు సర్వీసులు నిలిపేస్తున్నట్లు మహారాష్ట్ర ప్రకటించింది. కర్ణాటకలోని బెళగావిలో MSRTCపై KRV (కన్నడ రక్షక వేదిక) ప్రతినిధులు దాడి చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడికి బస్సులను నడపడం మంచిది కాదని పోలీసులు హెచ్చరించడంతో నిలిపేసింది. పోలీసుల క్లియరెన్స్ వచ్చిన తర్వాత బస్సు సర్వీసులను అధికారులు పునరుద్ధరించనున్నారు.
News February 22, 2025
IML T20: నిరాశపర్చిన సచిన్.. స్కోర్ ఎంతంటే?

ముంబైలో జరుగుతోన్న ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20-2025లో సచిన్ టెండూల్కర్ నిరాశ పరిచారు. శ్రీలంక మాస్టర్స్ జట్టుపై 8 బంతుల్లో 10 రన్స్ చేసి ఔటయ్యారు. అంబటి రాయుడు 5, గుర్కీరత్ సింగ్ మాన్ 44, స్టువర్ట్ బిన్నీ 68, యువరాజ్ 31*, యూసఫ్ పఠాన్ 56* రన్స్ చేశారు. ఇండియా మాస్టర్స్ 20 ఓవర్లలో 222/4 రన్స్ చేసింది.