News May 11, 2024

లోక్‌సభ ఎన్నికలపై బహిరంగ చర్చకు సిద్ధం: రాహుల్

image

లోక్‌‌సభ ఎన్నికలపై బహిరంగ చర్చకు సిద్ధమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం కోసం ప్రధాన పార్టీల చర్చను కాంగ్రెస్ స్వాగతిస్తుందని పేర్కొన్నారు. ఈ చర్చలో దేశ ప్రధాని పాల్గొంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ చొరవ తీసుకున్నవారికి ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు బహిరంగ చర్చకు రావాలని PM మోదీకి, రాహుల్ గాంధీకి రిటైర్డ్ జడ్జిలు, ప్రముఖులు లేఖ రాసిన సంగతి తెలిసిందే.

Similar News

News January 18, 2026

నేవీలో క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌కు అప్లై చేశారా?

image

<>ఇండియన్ <<>>నేవీ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌కు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఇంటర్ (MPC) అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ బ్రాంచీలో 44 ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. JEE మెయిన్స్ అర్హత, స్క్రీనింగ్, SSB ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జనవరి 2, 2007-జులై 1,2009 మధ్య జన్మించి ఉండాలి. వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in.

News January 18, 2026

కారణజన్ముడు ఎన్టీఆర్: సీఎం చంద్రబాబు

image

AP: NTR కారణజన్ముడు, యుగ పురుషుడు, పేదల పెన్నిధి అని CM CBN అన్నారు. ఆయన 30వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ‘‘సిని వినీలాకాశంలో ధృవతారగా వెలిగి, రాజకీయ కురుక్షేత్రంలో అజేయుడైన ‘అన్న’ NTR తరతరాల చరిత్రను తిరగరాశారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టారు. రూ.2కే కిలో బియ్యం, సామాజిక భద్రతా పింఛన్లు తదితర పథకాలతో చరిత్ర గతిని మార్చారు’’ అని కొనియాడారు.

News January 18, 2026

X యూజర్లకు మస్క్ ₹9 కోట్ల ఆఫర్!

image

ఎలాన్ మస్క్ అద్భుతమైన ఆఫర్ ప్రకటించారు. ‘X’లో అత్యుత్తమంగా నిలిచే ఒక లాంగ్ ఫామ్ ఆర్టికల్‌కు ఏకంగా $1M (సుమారు ₹9 కోట్లు) బహుమతి ఇస్తామన్నారు. క్రియేటర్లను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్టికల్ కనీసం 1,000 పదాలు ఉండాలి. కంటెంట్ ఒరిజినల్ అయి ఉండాలి. AI వాడొద్దు. ప్రస్తుతానికి ఈ పోటీ జనవరి 28 వరకు అమెరికాలోని ప్రీమియం యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.