News March 29, 2024

కడియంపై పోటీకి సిద్ధం: తాటికొండ రాజయ్య

image

TG: వరంగల్‌లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. బీఆర్ఎస్ పార్టీని వీడుతున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రకటించారు. ఈరోజు ఆయన కేటీఆర్‌తో భేటీ కానున్నారు. ఇటీవల అసెంబ్లీ టికెట్ రాకపోవడంతో రాజయ్య బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. ఇప్పుడు అవకాశం వస్తే రాజీనామాను ఉపసంహరించుకునేందుకు సిద్ధమయ్యారట.

Similar News

News January 2, 2026

ఒత్తిడిని ఇలా తగ్గించేద్దాం..

image

అధిక ఒత్తిడినించి బైట పడాలంటే చిన్న చిన్న పనులు చేయాలని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల ఆలోచనలు నెమ్మదిస్తాయి. డీప్‌ బ్రీతింగ్స్‌ తీసుకోవాలి. ముక్కు ద్వారా గాలిని పీల్చుకుని నోటి ద్వారా వదలాలి. చాలామంది ఒత్తిడికి గురైనప్పుడు ఆలోచించడం ఆపేయాలని అనుకుంటారు. కానీ దీని వల్ల ఆందోళన పెరుగుతుంది. కాబట్టి కొన్ని విషయాలు యాక్సెప్ట్‌ చేయడం అలవాటు చేసుకుంటేనే శరీరం, మనస్సు రిలాక్స్‌ అవ్వడం ప్రారంభిస్తాయి.

News January 2, 2026

గిగ్ వర్కర్లకు 90 రోజుల పని నిబంధన

image

గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు ప్రతిపాదించింది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకే అగ్రిగేటర్ వద్ద కనీసం 90 రోజులు, వేర్వేరు అగ్రిగేటర్ల వద్ద పనిచేసేవారు అయితే 120 రోజులు పని చేయాల్సి ఉంటుందని కేంద్ర కార్మిక శాఖ స్పష్టం చేసింది. ప్రతి ఒక్కరూ ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని ఇప్పటికే కేంద్రం సూచించింది. అర్హులైన వారికి డిజిటల్ ఐడీ కార్డులను జారీ చేయనుంది.

News January 2, 2026

మరోసారి కనిపించిన కిమ్ కుమార్తె.. వారసత్వానికి సంకేతాలా?

image

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె కిమ్ జు యే మరోసారి బహిరంగంగా కనిపించి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించారు. నూతన సంవత్సరం సందర్భంగా తల్లిదండ్రులతో కలిసి ‘కుమ్‌సుసన్’ స్మారకాన్ని సందర్శించి దేశ మాజీ నేతలకు నివాళులు అర్పించారు. గత మూడేళ్లుగా తండ్రితో పాటు అధికారిక కార్యక్రమాల్లో జు యే పాల్గొంటుండటంతో ఆమెను వారసురాలిగా స్థానిక మీడియా పేర్కొంటోంది. ఇటీవల చైనా పర్యటనలోనూ కనిపించారు.