News March 14, 2025
నియోజకవర్గాల పునర్విభజనపై పోరుకు సిద్ధం: KTR

TG: నియోజకవర్గాల పునర్విభజనపై TN CM స్టాలిన్ తలపెట్టిన JACతో కలిసి పోరాడుతామని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తెలిపారు. సమావేశానికి రావాల్సిందిగా TN మంత్రి నెహ్రూ, DMK MP ఇలంగో HYD వచ్చి ఆహ్వానించగా ఆయన సానుకూలంగా స్పందించారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయన్నారు. 22న జరిగే సమావేశానికి హాజరవుతామని చెప్పారు. ఈ విషయంపై ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో చూడాలన్నారు.
Similar News
News November 22, 2025
రేపు ఒంగోలులో జాతీయస్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీలు

ఒంగోలులోని డాక్టర్ BR అంబేడ్కర్ భవనంలో ఆదివారం 12వ జాతీయ స్థాయి కరాటే, కుంగ్ ఫు ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు బ్లాక్ బెల్ట్ 7వ డాన్ కరాటే మాస్టర్ వెంకటేశ్ తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో శనివారం మాట్లాడుతూ.. జాతీయస్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీలకు 13 రాష్ట్రాల నుంచి మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారులు రానున్నట్లు తెలిపారు. క్రీడల ప్రాముఖ్యతను తెలిపేందుకు పోటీలు దోహదపడతాయన్నారు.
News November 22, 2025
ఇనుప తీగల ఉచ్చుతో ఎలుకల నియంత్రణ

ఎలుకల నివారణకు ఈ పద్ధతి చక్కగా ఉపయోగపడుతుంది. ఇనుప తీగలు, వెదురు, తాటాకులతో తయారు చేసిన బుట్టలను ఎకరానికి 20 వరకు ఏర్పాటు చేయాలి. ఎలుకలను ఆకర్షించడానికి వాటిలో ఉల్లిపాయలు, టమాట, ఎండుచేపలు, బజ్జీలు లాంటివి ఉంచాలి. వీటిని పొలం గట్ల వెంబడి, గోదాముల్లో ఏర్పాటు చేసుకోవచ్చు. వరిలో నారుమడి పోసిన దగ్గర నుంచి దమ్ములు పూర్తై నాట్లు వేసిన నెల వరకు.. కోతల తర్వాత ఏర్పాటు చేస్తే ఎలుకలను సమర్థంగా నివారించవచ్చు.
News November 22, 2025
కానిస్టేబుల్ అభ్యర్థులకు శిక్షణ ప్రారంభించాలి: DYFI

AP: కానిస్టేబుల్ ఫలితాలు విడుదలై నెలలు గడుస్తున్నా శిక్షణ ప్రారంభించకపోవడంపై DYFI మండిపడింది. దీనివల్ల అభ్యర్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తెలిపింది. 6,100 మందికి వెంటనే ట్రైనింగ్ ఇచ్చి పోస్టింగ్ ఇవ్వాలని, లేదంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించింది. ఈ పోస్టులకు 2022లో నోటిఫికేషన్ వెలువడగా లీగల్ సమస్యలతో ప్రక్రియ ఆలస్యమైంది. ఈ ఏడాది జూన్లో మెయిన్స్ నిర్వహించి AUGలో రిజల్ట్స్ ప్రకటించారు.


