News October 2, 2024
ఇజ్రాయెల్‌కు సాయం చేయడానికి సిద్ధం: బైడెన్

ఇరాన్ దాడుల నుంచి రక్షణాత్మక ప్రతిదాడి విషయంలో ఇజ్రాయెల్‌కు ఆమెరికా సాయం చేయడానికి సిద్ధంగా ఉందని అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ఇరాన్ దాడులపై నేషనల్ సెక్యూరిటీ టీంతో చర్చించినట్టు వెల్లడించారు. అలాగే ఈ దాడుల నుంచి రక్షణ పొందడానికి ఇజ్రాయెల్‌కు చేయాల్సిన సాయం, ఈ ప్రాంతంలోని అమెరికన్ సిబ్బందిని రక్షించడానికి యూఎస్ సంసిద్ధతపై చర్చించినట్టు పేర్కొన్నారు.
Similar News
News January 27, 2026
ఎన్నికల కోడ్.. రూ.50వేల కంటే ఎక్కువ తీసుకెళ్తున్నారా?

TG: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో <<18975094>>కోడ్ అమల్లోకి<<>> వచ్చింది. దీంతో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో వ్యక్తులు గరిష్ఠంగా రూ.50వేల వరకు మాత్రమే నగదు తీసుకెళ్లాలి. అంతకంటే ఎక్కువ నగదు, విలువైన వస్తువులు(బంగారం, వెండి) ఉంటే ఎందుకు, ఎక్కడికి తీసుకెళ్తున్నారో ఆధారాలు చూపాలి. లేదంటే సీజ్ చేస్తారు. ఆ సమయంలో పోలీసులు రిసీట్ ఇస్తారు. తర్వాత అప్పీల్ చేసుకొని ఆధారాలు చూపితే నగదును తిరిగిస్తారు.
News January 27, 2026
CBIకి ఇస్తారా.. సిట్టింగ్ జడ్జికి ఇస్తారా: KTR

TG: దేశంలో ఏ బొగ్గు గనిలోలేని ‘సైట్ విజిట్ సర్టిఫికేషన్’ ఇక్కడే ఎందుకని KTR ప్రశ్నించారు. ‘నిజంగానే కేంద్రం సిఫార్సు చేసుంటే అప్పటి BRS ప్రభుత్వం అమలు చేయలేదు. మరిప్పుడు అవసరంలేని నిబంధన కాంగ్రెస్ ఎందుకు తెచ్చింది. ఇది ఎవరి లాభం కోసం? గవర్నర్ ఇన్వాల్వ్ కావాలి లేదా కిషన్ రెడ్డికి ఆదేశమివ్వాలి. CBIతో ఎంక్వైరీ చేయిస్తారా, సిట్టింగ్ జడ్జికిస్తారా అనేది మీ ఇష్టం’ అని మీడియాతో మాట్లాడారు.
News January 27, 2026
త్వరలో ATMలలో చిన్న నోట్లు.. ఛేంజ్ కూడా తీసుకోవచ్చు!

₹10, 20, 50 వంటి చిన్న నోట్ల చెలామణీ పెంచేందుకు కొత్త ATMలను తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. ₹500, ₹100తోపాటు చిన్న నోట్లు విత్ డ్రా చేసుకునేలా ప్లాన్ చేస్తున్నట్లు Mint తెలిపింది. ముంబైలో పరీక్షిస్తున్నారని, ఆమోదం వస్తే దేశమంతటా అమలు చేస్తారని సమాచారం. ATMలో ఛేంజ్ తీసుకునే అంశాన్నీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఉదాహరణకు మన దగ్గర ఉన్న ₹500 నోటును అందులో ఉంచి, ఐదు ₹100 నోట్లను తీసుకోవచ్చు.


