News July 9, 2024
అవసరమైతే ఆడేందుకు సిద్ధమే: వార్నర్

ఆస్ట్రేలియన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అయితే జట్టు ప్రయోజనాల కోసం వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉంటానని చెప్పారు. ‘కొంత కాలం ఫ్రాంచైజీ క్రికెట్ను కొనసాగిస్తాను. ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికైతే తప్పకుండా ఆడేందుకు సిద్ధమే’ అని ఇన్స్టా పోస్టులో రాసుకొచ్చారు. మరోవైపు తన వారసుడిగా మెక్గుర్క్ను వార్నర్ ఇప్పటికే ప్రకటించారు.
Similar News
News November 18, 2025
సచివాలయాలకు పర్యవేక్షకులు వీరే..

AP: గ్రామ, వార్డు సచివాలయాలకు మండల స్థాయిలో పర్యవేక్షకులుగా 660 మంది డిప్యూటీ MPDOలను ప్రభుత్వం నియమించనుంది. అలాగే జిల్లా స్థాయిలో పర్యవేక్షకులుగా ZP CEO, డిప్యూటీ సీఈవో, జాయింట్ డైరెక్టర్ క్యాడర్ అధికారులకు బాధ్యతలు అప్పగించనుంది. నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. కాగా సచివాలయాలను 3 కేటగిరీలుగా విభజించిన విషయం తెలిసిందే. A కేటగిరీలో ఆరుగురు, Bలో 7, Cలో ఎనిమిది మంది ఉద్యోగులు ఉంటారు.

మావోయిస్టు అగ్రనేత హిడ్మా హతం

AP: మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా హతమయ్యాడు. హిడ్మాతో పాటు ఆయన భార్య సహా ఆరుగురు మావోలు మరణించారు. హిడ్మా కోసం పలు రాష్ట్రాల పోలీసులు ఎంతోకాలంగా వెతుకుతున్నారు. ప్రస్తుతం అతడు మావోయిస్టు పార్టీ యాక్షన్ టీమ్ సెక్రటరీగా ఉన్నాడు.