News October 22, 2024
టెస్టుల్లో మళ్లీ ఆడేందుకు సిద్ధం: డేవిడ్ వార్నర్

టెస్టుల నుంచి రిటైరైన ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన సేవలు అవసరమైతే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సాధన కోసం షెఫీల్డ్ షీల్డ్లో ఆడతానని పేర్కొన్నారు. వార్నర్ రిటైర్మెంట్ తర్వాత టెస్టుల్లో ఆస్ట్రేలియాకు స్మిత్ ఓపెనింగ్ చేస్తుండగా, BGTకి ఆ స్థానం నుంచి తప్పుకొన్నారు. ఓపెనింగ్ స్థానానికి ఖాళీ ఏర్పడిన నేపథ్యంలో వార్నర్ తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు.
Similar News
News January 7, 2026
ట్రంప్ నోటి దురుసు.. ప్రభుత్వ మౌనంపై ప్రతిపక్షాల మండిపాటు!

‘భారత్ నన్ను సంతోషపెట్టాలి. అందుకు వాళ్లు ప్రయత్నిస్తున్నారు. నేను విధించిన టారిఫ్స్ వల్ల మోదీ అసంతృప్తిగా ఉన్నారు’ అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. వీటిపై భారత ప్రభుత్వం మౌనం వహించడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ‘ఎందుకు భయపడుతున్నారు? దేశ గౌరవాన్ని తాకట్టు పెడుతున్నారా?’ అని ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వం స్పందించకపోవడంతో విమర్శల వేడి పెరుగుతోంది.
News January 7, 2026
ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్లు కొట్టివేత

TG: నాంపల్లి కోర్టులో ఐబొమ్మ రవికి బిగ్ షాక్ తగిలింది. 5 కేసుల్లో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం కొట్టేసింది. అతడికి విదేశాల్లో పౌరసత్వం ఉందని, బెయిల్ ఇస్తే దేశం దాటి పోయే అవకాశం ఉందని పోలీసులు వాదించారు. వారి వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం రవి బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది.
News January 7, 2026
RARE: పర్ఫెక్ట్ ఫిబ్రవరి.. గమనించారా?

వచ్చే ఫిబ్రవరి నెలను ‘పర్ఫెక్ట్ ఫిబ్రవరి’గా నెటిజన్లు అభివర్ణిస్తున్నారు. ఆ నెల ఆదివారంతో మొదలై సరిగ్గా 28 రోజులు పూర్తి చేసుకుని శనివారంతో ముగియనుంది. అంటే ఎక్కడా మిగిలిపోకుండా కచ్చితంగా 4 వారాల కాలచక్రాన్ని కలిగి ఉండటం విశేషం. చివరిసారిగా 2015లో ఇలానే జరిగింది. క్యాలెండర్లో నెలంతా ఒక క్రమ పద్ధతిలో సెట్ అవ్వడంతో దీనిపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మీరూ ఇది గమనించారా? COMMENT


