News December 17, 2024

జమిలి బిల్లును జేపీసీకి పంపేందుకు సిద్ధం: షా

image

ప్రతిపక్షాల వినతి మేరకు జమిలి బిల్లును జేపీసీకి పంపేందుకు తాము సిద్ధమని కేంద్రమంత్రి అమిత్ షా లోక్‌సభలో ప్రకటించారు. క్యాబినెట్ భేటీలోనూ ప్రధాని మోదీ ఇదే విషయాన్ని తమకు స్పష్టం చేశారని చెప్పారు. ఈమేరకు ఆయన న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్‌కు సూచన చేశారు. మరోవైపు బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్, ఎస్పీ, టీఎంసీ, డీఎంకే తదితర పార్టీల ఎంపీలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Similar News

News December 31, 2025

ఇన్నోవికాస్-2025లో భాగస్వామ్య ఒప్పందం

image

రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌తో వికాస్ ఇంజినీరింగ్ కళాశాల మధ్య భాగస్వామ్య ఒప్పందం కుదిరిందని హబ్ CEO జి. కృష్ణన్ వెల్లడించారు. వికాస్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి టెక్నాలజీ ప్రదర్శన ‘ఇన్నోవికాస్-2025’ రెండో రోజు కొనసాగింది. సస్టైనబుల్ అభివృద్ధి లక్ష్యాల ఆధారంగా విద్యార్థులు రూపొందించిన కొత్త ఆలోచనలు, నమూనాలను హబ్ ద్వారా సాంకేతికంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.

News December 31, 2025

సోదరుడి కుమారుడితో అసిమ్ కూతురి పెళ్లి!

image

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ తన మూడో కూతురి పెళ్లి చేశాడు. తన సోదరుడి కుమారుడు అబ్దుల్ రహమాన్‌కు ఇచ్చి రావల్పిండిలోని ఆర్మీ ప్రధాన కార్యాలయంలో DEC 26న వివాహం జరిపించాడని నేషనల్ మీడియా పేర్కొంది. ఈ వేడుకకు పాక్ అధ్యక్షుడు, ప్రధాని, ISI చీఫ్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. కాగా మునీర్‌కు నలుగురు కూతుళ్లు. అబ్దుల్ రహమాన్‌ ఆర్మీలో పని చేసి రిజర్వేషన్ కోటాలో సివిల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యాడు.

News December 31, 2025

APPLY NOW: 102 పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ

image

<>UPSC<<>> వివిధ విభాగాల్లో 102 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ట్రేడ్ మార్క్& జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఎగ్జామినర్, కంట్రోలర్ ఆఫీస్ జనరల్ పేటెంట్స్, డిజైన్స్& ట్రేడ్ మార్క్స్‌లో 100 పోస్టులు, 2 డిప్యూటీ డైరెక్టర్ పోస్టులు (UPSC) ఉన్నాయి. పోస్టును బట్టి పీజీ, LLB, LLM, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: upsc.gov.in