News September 21, 2024

టీటీడీకి పాల ఉత్పత్తులు ఇచ్చేందుకు సిద్ధం: విజయ డెయిరీ

image

TG: తిరుమల లడ్డూ కల్తీ వార్తల నేపథ్యంలో టీటీడీకి పాల ఉత్పత్తులు అందించేందుకు సిద్ధమని తెలంగాణ విజయ డెయిరీ పేర్కొంది. దేవస్థానానికి సమర్పించే నైవేద్యాలకు నాణ్యమైన ఉత్పత్తులు సరఫరా చేస్తామని తెలిపింది. ఈ విషయాన్ని టీటీడీ ఈవో శ్యామలరావుకు లేఖ ద్వారా తెలియజేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి సబ్యసాచి ఘోష్ వెల్లడించారు.

Similar News

News September 21, 2024

ఇది క్షమించరాని నేరం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

image

TG: తిరుమల లడ్డూ ఘటన దిగ్భ్రాంతిని కలిగించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రసాదాన్ని అపవిత్రం చేయడం క్షమించరాని నేరమని, ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడటమే కాకుండా బాధ్యులను కఠినంగా శిక్షించాలన్నారు.

News September 21, 2024

చంద్రబాబు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి: అంబటి రాంబాబు

image

AP: ప్రాయశ్చిత్త <<14161291>>దీక్ష<<>> చేయాల్సింది పవన్ కళ్యాణ్ కాదని చంద్రబాబు చేయాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. కలియుగ దైవాన్ని అడ్డుపెట్టుకొని భక్తుల మనోభావాలను సీఎం దెబ్బతీశారని దుయ్యబట్టారు. రాజకీయ కక్షతో గత ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేసిన బాబు దీక్ష చేయాలని రాంబాబు ట్వీట్ చేశారు.

News September 21, 2024

NPA డైరెక్టర్‌గా అమిత్ గార్గ్

image

హైదరాబాద్‌లోని నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా అమిత్ గార్గ్ నియమితులయ్యారు. 1993 బ్యాచ్‌కు చెందిన గార్గ్ 2027 అక్టోబర్ 31 వరకు పదవిలో ఉంటారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డైరెక్టర్‌గా 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అలోక్ రంజన్ నియమితులయ్యారు. 1993 బ్యాచ్‌ ఐపీఎస్ ఆఫీసర్లు రిత్విక్ రుద్ర, మహేశ్ దీక్షిత్, ప్రవీణ్ కుమార్, అరవింద్ కుమార్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో స్పెషల్ డైరెక్టర్లుగా నియమితులయ్యారు.