News May 26, 2024
చైనాతో కలిసి పనిచేసేందుకు సిద్ధం: తైవాన్

చైనా విషయంలో తైవాన్ దూకుడును తగ్గించింది. ఆ దేశ నూతన అధ్యక్షుడు లాయ్ చింగ్-తె ఇటీవల చేసిన ప్రసంగంలో చైనాపై విరుచుకుపడ్డారు. దీంతో తైవాన్ చుట్టూ బీజింగ్ సైనిక విన్యాసాలు చేపట్టింది. ఈక్రమంలోనే లాయ్ ఇప్పుడు మెత్తబడ్డారు. ‘మాకు ప్రాంతీయ స్థిరత్వం కీలకం. అందుకోసం చైనాతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ విషయంలో పరస్పర అంగీకారంతో ఇరు దేశాలు ఓ ఒప్పందానికి రావాలి’ అని కోరారు.
Similar News
News February 1, 2026
నందినగర్‌కు చేరుకున్న కేసీఆర్

TG: కాసేపట్లో సిట్ విచారణ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ నందినగర్‌లోని నివాసానికి చేరుకున్నారు. ఇప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు విచారణ గదిని పరిశీలించారు. ఇంటి చుట్టూ భారీ భద్రత ఏర్పాటుచేశారు. మరోవైపు కేసీఆర్‌కు సిట్ నోటీసులపై రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేస్తున్నాయి.
News February 1, 2026
TAX: ఆశించిందొకటి.. ఇచ్చింది మరొకటి!

ట్రేడర్లు ఊహించిందొకటైతే నిర్మలమ్మ ఇచ్చింది మరొకటి. షేర్స్, ఫ్యూచర్స్, ఆప్షన్స్ కొనేటప్పుడు వేసే సెక్యూరిటీ ట్రాన్జాక్షన్స్ ట్యాక్స్ (STT)ను తగ్గిస్తారని ఆశించారు. ఆప్షన్స్‌పై 0.1 నుంచి 0.15%, ఫ్యూచర్స్‌పై 0.05 శాతానికి పన్ను పెంచడంతో ఉసూరుమంటున్నారు. ఉద్రేకంతో అమ్మకాలు చేపట్టడంతో సూచీలు కుదేలయ్యాయి. అనిశ్చితి, రాబోయే సంక్షోభాన్ని ఊహించి స్పెక్యులేషన్ నివారించేందుకే ఇలా చేసినట్టు తెలుస్తోంది.
News February 1, 2026
సముద్ర స్నానంతో ఆరోగ్యమెలా?

నదులన్నీ సముద్రంలోనే కలుస్తాయి. అందుకే సముద్రంలో స్నానం చేయడం వల్ల సకల నదులలో స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. సముద్రుడి అనుగ్రహంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని నమ్మకం. ఒకవేళ సముద్రం లేదా నదులు అందుబాటులో లేకపోతే, బావుల వద్ద స్నానం చేసేటప్పుడు గంగ, యమున, కావేరి వంటి పవిత్ర నదుల పేర్లను భక్తితో స్మరిస్తే అదే ఫలితం కలుగుతుందని పద్మపురాణం వివరిస్తోంది.


