News May 21, 2024
రావణుడి పాత్ర కోసం రియల్ గోల్డ్?

నితేశ్ తివారి తెరకెక్కిస్తోన్న ‘రామాయణ’లో రావణుడి పాత్ర చేస్తున్న యశ్ నిజమైన బంగారు అభరణాలు వినియోగించనున్నట్లు సమాచారం. రావణుడు స్వర్ణ నగరమైన లంకాధిపతి కాబట్టి ఇలా చేయనున్నట్లు తెలుస్తోంది. సీతారాములుగా సాయిపల్లవి, రణ్బీర్ కపూర్ నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల మొదలైన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్తో రూపొందుతోన్న ఈ మూవీకి సహనిర్మాతగానూ యశ్ వ్యవహరిస్తున్నారు.
Similar News
News December 3, 2025
APPLY NOW: IIFTలో ఉద్యోగాలు

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారన్ ట్రేడ్ 6 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. కార్పొరేట్ రిలేషన్స్&కెరీర్ అడ్వాన్స్మెంట్ కోఆర్డినేటర్(3) పోస్టులకు ఈనెల 11వరకు, రీసెర్చ్ అసోసియేట్, కేస్ స్టడీ మేనేజర్ పోస్టులకు ఈనెల 13వరకు, గ్రాఫిక్ డిజైనర్ పోస్టుకు ఈ నెల 15వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBA/PGDBM/PG, PhD, డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు అర్హులు. వెబ్సైట్: www.iift.ac.in
News December 3, 2025
PM మోదీకి CM రేవంత్ అందించిన వినతులివే

⋆HYD మెట్రో రెండో దశ విస్తరణను కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్గా చేపట్టేందుకు ఆమోదించాలి
⋆RRR ఉత్తర, దక్షిణ భాగం నిర్మాణానికి, మన్ననూర్-శ్రీశైలం 4 వరుసల ఎలివేటేడ్ కారిడార్కు అనుమతులివ్వాలి. RRR వెంట రీజనల్ రింగ్ రైలు ప్రాజెక్టును చేపట్టాలి
⋆HYD-అమరావతి-మచిలీపట్నం పోర్ట్ 12 లేన్ల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, HYD-BLR గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి చొరవ చూపాలి
News December 3, 2025
ఏఐతో అశ్లీల ఫొటోలు.. X వేదికగా రష్మిక ఫిర్యాదు

అసభ్యకరంగా మార్ఫింగ్ చేసిన తన ఫొటోలు వైరల్ కావడంతో హీరోయిన్ రష్మిక Xలో ఘాటుగా స్పందించారు. ‘AIని అభివృద్ధి కోసం కాకుండా కొందరు అశ్లీలతను సృష్టించడానికి, మహిళలను లక్ష్యంగా చేసేందుకు దుర్వినియోగం చేస్తున్నారు. AIని మంచి కోసం మాత్రమే వాడుకుందాం. ఇలాంటి దుర్వినియోగానికి పాల్పడేవారికి కఠిన శిక్ష విధించాలి’ అని కోరుతూ ‘Cyberdost’కు ట్యాగ్ చేసి ఫిర్యాదు చేశారు.


