News July 18, 2024

ఉమ్రాన్ మాలిక్ వెనుకబడటానికి కారణమదే: మాజీ కోచ్

image

జమ్మూకశ్మీర్‌ పేసర్ ఉమ్రాన్ మాలిక్ ఐపీఎల్, టీమ్ ఇండియాలో తళుక్కున మెరిసి కనుమరుగైపోయారు. అందుకు గల కారణాన్ని భారత మాజీ బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే వెల్లడించారు. ‘146-148 కి.మీ వేగంతో నిలకడగా బౌలింగ్ చేయడం చాలా కష్టం. అయితే, ఎంత వేగంగా విసిరినా లైన్ అండ్ లెంగ్త్ కూడా ముఖ్యం. అది తప్పితే ధారాళంగా పరుగులిచ్చుకోవాల్సిందే. తనకు ఇప్పుడు అదే సమస్య. భవిష్యత్తులో మెరుగవుతాడని భావిస్తున్నాం’ అని తెలిపారు.

Similar News

News December 9, 2025

తప్పిపోయిన అవ్వను గుర్తించిన మనమడు.. ఎలాగంటే?

image

అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న 75 ఏళ్ల వృద్ధురాలు(ముంబై) ఇంటి నుంచి బయటకెళ్లి తప్పిపోయారు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందగా ఆమె మనమడు మాత్రం తన ఆలోచనకు పదును పెట్టాడు. వృద్ధురాలు తాజుద్దీన్ ధరించిన నక్లెస్‌లో ఉన్న GPSతో ఆమె ఉన్న చోటును ట్రాక్ చేశాడు. బైక్ ఢీకొట్టడం వల్ల ఆస్పత్రిపాలైనట్లు తెలుసుకొని ఆమెను సురక్షితంగా ఇంటికి తీసుకొచ్చాడు. అలా సాంకేతికత ఆమెను తిరిగి కుటుంబానికి దగ్గర చేసింది.

News December 9, 2025

స్థూల సేంద్రియ ఎరువుల ప్రత్యేక ఏమిటి?

image

స్థూల సేంద్రియ ఎరువుల్లో పోషకాలు తక్కువ పరిమాణంలో ఉంటాయి. వీటిని ఎక్కువ పరిమాణంలో వాడవలసి ఉంటుంది. వీటి వినియోగంతో నేలలో నీరు ఇంకే స్వభావం, నీరు నిల్వ చేసే గుణం, నీటి పారుదల, నేల ఉష్ణోగ్రత, గాలి ప్రసరణ మెరుగుపడతాయి. ఉదాహరణ: పశువుల ఎరువు, కోళ్లు, మేకల విసర్జన పదార్థాల ఎరువు, పచ్చిరొట్ట ఎరువులు మొదలైనవి. ఇవి మన ఊళ్లలోనే దొరుకుతాయి. వాటిని వృథాగా వదిలేయకుండా పొలాల్లో వేస్తే మంచి ఫలితాలు వస్తాయి.

News December 9, 2025

5,74,908 ఎకరాల అసైన్డ్ భూములపై పున:పరిశీలన: CM CBN

image

AP: గత ప్రభుత్వంలో ఫ్రీ హోల్డ్‌లో ఉంచిన 5,74,908 ఎకరాల అసైన్డ్ భూములపై పున:పరిశీలన చేయాలని CM CBN అధికారులను ఆదేశించారు. ‘EX సర్వీస్‌మెన్, రాజకీయ బాధితులు, స్వాతంత్ర్యయోధులు, 1954కి ముందు అసైన్డ్ అయిన వాళ్ల భూములను 22A నుంచి తొలగించాలి. అనుమతుల్లేని 430 రియల్ వెంచర్లలోని 15,570 ప్లాట్లకు యూజర్ ఫ్రెండ్లీ రిజిస్ట్రేషన్లు చేయాలి. 2.77 కోట్ల CAST సర్టిఫికెట్లు ఆధార్‌తో అనుసంధానించాలి’ అని సూచించారు.