News October 26, 2024

నితీశ్ కుమార్ ఎంపికకు కారణమిదే: కుంబ్లే

image

ఆస్ట్రేలియాతో జరగనున్న <<14454917>>టెస్టు సిరీస్‌కు<<>> తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డిని ఎంపిక చేయడం ఆశ్చర్యపరిచిందని మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే అన్నారు. అయితే అతని ఆల్‌రౌండర్ నైపుణ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చోటు కల్పించి ఉంటారని అభిప్రాయపడ్డారు. నితీశ్ వేగంగా బౌలింగ్ చేయడమే కాకుండా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తారని కొనియాడారు. ఈ కారణంతోనే 18 మందితో కూడిన జట్టులో చోటు దక్కించుకొని ఉంటారన్నారు.

Similar News

News November 4, 2024

పంచాయతీ కార్యదర్శులు స్థానికంగానే నివాసం ఉండాలి: మంత్రి

image

TG: గ్రామ పంచాయతీ కార్యదర్శులు స్థానికంగానే నివాసం ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. పనిలో నిర్లక్ష్యం వహించే వారిపై వేటు వేయాలని అధికారులకు సూచించారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

News November 4, 2024

రేపు సరస్వతి పవర్ భూములను పరిశీలించనున్న పవన్

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు పల్నాడులో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మాచవరం మండలంలోని సరస్వతి పవర్ భూములు పరిశీలించనున్నట్లు డిప్యూటీ సీఎం కార్యాలయం తెలిపింది. సరస్వతి శక్తికి సంబంధించిన భూ ఉల్లంఘనలను తనిఖీ చేస్తానని పవన్ కళ్యాణ్ సైతం వెల్లడించారు. కాగా సరస్వతి భూముల విషయంలో వైసీపీ అధినేత జగన్, షర్మిల మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే.

News November 4, 2024

స్టిక్క‌ర్ స్కాం.. అమెజాన్‌కు ₹1.29 కోట్లు టోక‌రా పెట్టిన యువ‌కులు

image

రాజ‌స్థాన్‌కు చెందిన రాజ్‌కుమార్‌, సుభాశ్‌ అమెజాన్‌కు ₹1.29Cr టోక‌రా పెట్టి మంగళూరులో దొరికిపోయారు. వీరు అమెజాన్‌లో త‌క్కువ ధర, లక్షలు విలువైన ఐటమ్స్ ఒకేసారి ఆర్డర్ పెట్టేవారు. ఆర్డర్ వచ్చాక డెలివరీ బాయ్‌ కళ్లుగప్పి లక్షల విలువైన వస్తువుల స్టిక్కర్లను తక్కువ విలువైన వాటి స్టిక్కర్లతో మార్చేవారు. తీరా హైవాల్యూ ఐటం క్యాన్సిల్ చేసేవారు. తద్వారా లక్షల విలువైన వస్తువులను తక్కువ ధరకే కొట్టేసేవారు.