News October 24, 2024
‘న్యాయదేవత’ మార్పునకు కారణాలేంటో తెలీదు: SC బార్ అసోసియేషన్

సుప్రీంకోర్టులో విప్లవాత్మక మార్పులను కపిల్ సిబల్ నేతృత్వంలోని బార్ అసోసియేషన్ ప్రశ్నించింది. కొత్త ఎంబ్లెమ్, న్యాయదేవత మార్పులపై తమను సంప్రదించలేదని పేర్కొంది. మ్యూజియం ప్రతిపాదించిన స్థలంలో లాయర్లకు కెఫేను నిర్మించాలని డిమాండ్ చేసింది. తాము వ్యతిరేకిస్తున్నా మ్యూజియం పనులు మొదలవ్వడంపై ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయ పరిపాలనలో తామూ సమాన హక్కుదారులమని, మార్పులు తమ దృష్టికి తీసుకురాలేదని తెలిపింది.
Similar News
News January 29, 2026
రసాయనాలతో లడ్డూ చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారు: పవన్

AP: నెయ్యి పేరుతో రసాయనాల మిశ్రమాన్ని తిరుమలకు సరఫరా చేశారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించారు. రసాయనాలతో లడ్డూ చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని మండిపడ్డారు. వైసీపీ అరాచకాలను ప్రజలకు చెబుదామని జనసేన ఎమ్మెల్యేలతో సమావేశంలో అన్నారు. శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై శాసనసభలో చర్చిద్దామని చెప్పారు. ఈ మీటింగ్‌లో ఎమ్మెల్యే <<18982020>>అరవ శ్రీధర్<<>> గురించీ చర్చించారని సమాచారం.
News January 29, 2026
BC జాబితా నుంచి TG తొలగించిన కులాలు ఇవే 1/2

TG: ఉమ్మడి APలోని BC జాబితా నుంచి మినహాయించిన 26 కులాలను రానున్న ఎన్నికల్లో బీసీ స్థానాల్లో పోటీకి అనుమతించరాదని GO ఇవ్వడం తెలిసిందే. బీసీ కమిషన్ నోటిఫికేషన్ ప్రకారం బీసీ జాబితా నుంచి తొలగించిన కులాలు ఇలా ఉన్నాయి. బండార, కోర్చ, కళింగ, కూరాకుల, పొండార, సామంతుల/సమంత/సౌంతియా/సౌంటియా, ఆసాదుల/అసదుల, కెయుట/కెవుటో/కెవిటి, అచ్చుకట్లవాండ్లు, నాగవడ్డీలు, కుంచిటి/వక్కలిగ/వక్కలిగర/కుంచిటిగ.
News January 29, 2026
BC జాబితా నుంచి TG తొలగించిన కులాలు ఇవే 2/2

తెలంగాణలో BC జాబితా నుంచి తొలగించిన కులాల్లో ఇంకా… గుడియా, ఆగరు,అతగార, గవర, గోడబా, జక్కల, కాండ్ర, కొప్పులవెలమ, నాగవాసం (నాగవంశం), పోలినాటి వెలమ, తూర్పుకాపులు/గాజులకాపులు, సదర/సదరు, అరవ, బేరి వైశ్య/ బేరి చెట్టి, అతిరస కులాలున్నాయి. కాగా కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించాక తెలంగాణ సామాజిక, సాంస్కృతిక మూలాలను అనుసరించి AP BC జాబితాలోని 112 కులాలను TG అడాప్ట్ చేసుకుంది. కొత్తగా 17 కులాలను చేర్చింది.


