News June 12, 2024

వాట్సాప్‌లో ‘రీసెంట్ కమ్యూనిటీ మీడియా’ ఫీచర్!

image

వాట్సాప్‌లో కమ్యూనిటీ గ్రూప్స్‌కు సంబంధించి ‘రీసెంట్ కమ్యూనిటీ మీడియా’ ఫీచర్ రానుంది. దీనితో గ్రూపుల్లో రీసెంట్‌గా షేర్ చేసిన మీడియా ఫైల్స్‌ను ఆయా గ్రూపుల్లోని సభ్యులు సెపరేట్ సెక్షన్‌లో సులభంగా చూడవచ్చు. అలాగే ఏ ఫైల్ సైజు ఎంత అనే వివరాలు కూడా కనిపిస్తాయి. దీంతో అవసరం లేని, లార్జ్ ఫైల్స్‌ను గుర్తించి యూజర్లు డిలీట్ చేసుకోవచ్చు. తద్వారా స్టోరేజ్ స్పేస్ పెరుగుతుంది.

Similar News

News February 11, 2026

సల్మాన్ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం ఉంటుంది: ఏక్‌నాథ్ షిండే

image

RSS శతాబ్ది వేడుకలకు నటుడు సల్మాన్ ఖాన్ హాజరవడంపై వస్తున్న విమర్శలను మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే తిప్పికొట్టారు. సల్మాన్ భారతీయ పౌరుడని, మన సంస్కృతిని గౌరవిస్తారని గుర్తుచేశారు. ఆయన ఇంట్లో వినాయకుడి విగ్రహం ఉంటుందని తెలిపారు. ఒక కార్యక్రమానికి హాజరైనంత మాత్రాన వివాదం చేయడం సరికాదన్నారు. ఆయన దేశభక్తిని, సంస్కృతిని గౌరవించే తత్వాన్ని చూడాలని సూచించారు.

News February 11, 2026

మార్చి 7 వరకు అసెంబ్లీ సమావేశాలు

image

AP: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మార్చి 7వ తేదీ వరకు నిర్వహించాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీ(BAC) భేటీలో నిర్ణయించారు. 17 రోజులపాటు సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 14న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 15న శివరాత్రి, తర్వాతి రోజు 16న, మార్చి 1, 2, 3 తేదీల్లో సెలవులు ఉండనున్నాయి. 17, 18 తేదీల్లో బడ్జెట్‌పై చర్చిస్తారు. అవసరమైతే సమావేశాలను పొడిగించాలని నిర్ణయించారు.

News February 11, 2026

నో ఎగ్జామ్.. టెన్త్ ఉత్తీర్ణతతో 28,740 ఉద్యోగాలు

image

పోస్టాఫీసుల్లో 28,740 బీపీఎం, GDS, ఏబీపీఎం ఉద్యోగాలకు దరఖాస్తు గడువు feb 14తో ముగియనుంది. 16 వరకు ఫీజు చెల్లించాలి. ఏపీలో 1,060, తెలంగాణలో 608 పోస్టులు ఖాళీ ఉన్నాయి. టెన్త్ ఉత్తీర్ణత కలిగి ఉండి 18-40 ఏళ్ల వయసున్న వారు అర్హులు. టెన్త్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎలాంటి ఎగ్జామ్ ఉండదు. శాలరీ పోస్టును బట్టి రూ.10వేల నుంచి రూ.29,380గా ఉంది.
అప్లికేషన్ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.