News April 20, 2024

రిసెప్షన్ పెళ్లిలో భాగం కాదు: బాంబే హైకోర్టు

image

పెళ్లి తర్వాత జరిగే రిసెప్షన్‌ను పెళ్లి ఆచారాల్లో భాగంగా పరిగణించలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. 2015లో రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో పెళ్లి చేసుకున్న ఓ జంట ముంబైలో రిసెప్షన్ చేసుకుంది. 2020లో ముంబై ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసింది. పిటిషన్‌ను ఫ్యామిలీ కోర్టు తిరస్కరించగా హైకోర్టుకు వెళ్లారు. అయితే.. పెళ్లి ఎక్కడ చేసుకున్నారో అక్కడే విడాకులకు దరఖాస్తు చేసుకోవాలని HC సూచించింది.

Similar News

News November 19, 2024

BGT కోసం భారత క్రికెటర్ల ప్రాక్టీస్

image

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం టీమ్ ఇండియా క్రికెటర్లు సన్నద్ధమవుతున్నారు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, జైస్వాల్, రిషభ్ పంత్ ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గాయం కారణంగా శుభ్‌మన్ గిల్ ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్నారు. ఆయన హోటల్ రూమ్‌లోనే ఉండిపోయారు. కాగా ఈ నెల 22 నుంచి INDvsAUS మధ్య పెర్త్‌లో తొలి టెస్టు ప్రారంభం కానుంది.

News November 19, 2024

‘అన్నదాత సుఖీభవ’కు బడ్జెట్ కేటాయించాం: అచ్చెన్నాయుడు

image

AP: త్వరలోనే అన్నదాత సుఖీభవ నిధులను రైతులకు ఇస్తామని, ఇందుకోసం ఇప్పటికే బడ్జెట్‌లో రూ.4,500 కోట్లు కేటాయించామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మండలిలో YCP సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ‘ఏటా రైతులందరికీ రూ.20 వేలు అందజేస్తాం. ఇందులో PM కిసాన్ రూ.6 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలు కలిపి ఇస్తాం. 41.4 లక్షల మంది రైతులకు ఈ పథకం అందిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.

News November 19, 2024

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఎలా మొదలైందంటే?

image

ఏకైక టెస్టు మ్యాచ్ ఆడేందుకు ఆస్ట్రేలియా 1996లో భారత పర్యటనకు వచ్చింది. అప్పుడే క్రికెట్‌కు విశేష సేవలందించిన దిగ్గజ క్రికెటర్లు అలెన్ బోర్డర్, సునీల్ గవాస్కర్ గౌరవార్థం ఓ సిరీస్ నిర్వహించాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. వెంటనే ఈ సిరీస్‌కు ‘బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ’గా నామకరణం చేశాయి. అలా మొదలైన ఈ సిరీస్ ఇప్పటికీ కొనసాగుతోంది. ఇరుజట్ల మధ్య మొత్తం 16 సిరీస్‌లు జరగ్గా టీమ్‌ఇండియా 10సార్లు నెగ్గింది.