News January 26, 2025

30 ఏళ్ల పోరాటానికి దక్కిన గుర్తింపు

image

1965లో ఉమ్మడి వరంగల్(D) న్యూశాయంపేటలో జన్మించిన మందకృష్ణ మాదిగ విద్యార్థి దశలోనే కులవివక్షపై పోరాడారు. కొంతకాలం పీపుల్స్‌వార్‌లో పనిచేశారు. తర్వాత బయటికొచ్చి దళిత ఉద్యమకారుడిగా మారారు. SC వర్గీకరణ కోసం 1994లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించారు. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాట ఫలితంగా గతేడాది SC వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈక్రమంలోనే నిన్న ఆయనకు కేంద్రం ‘పద్మశ్రీ’ ప్రకటించింది.

Similar News

News January 27, 2026

నిద్ర నాణ్యత పెంచుకోండిలా!

image

పగలంతా హుషారుగా పనిచేయాలంటే రాత్రి నాణ్యమైన నిద్ర అవసరం. అందుకు రోజూ ఒకే టైమ్‌కు నిద్ర పోవడం, లేవడం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. సెలవు రోజుల్లోనూ దీన్ని పాటించాలంటున్నారు. పడుకునే చోట లైట్లు పడకుండా, శబ్దాలు రాకుండా చూసుకోవాలని చెబుతున్నారు. రాత్రి వేళ లైట్ ఫుడ్ తీసుకోవడంతో పాటు నిద్రకు 30-60ని. ముందు స్క్రీన్ చూడటం ఆపాలని సూచిస్తున్నారు. ఒత్తిడికి గురయ్యే విషయాల గురించి ఆలోచించొద్దంటున్నారు.

News January 27, 2026

పహల్గాం హీరో అదిల్‌కు అవార్డు

image

గత ఏప్రిల్‌లో ఉగ్రమూకలు పహల్గాంలో జరిపిన దాడిలో ధైర్యంగా పోరాడి ప్రాణాలర్పించిన అదిల్ హుస్సేన్ షాకు JK ప్రభుత్వం అవార్డు ప్రకటించింది. విచక్షణారహితంగా దాడి చేస్తున్న ఉగ్రవాదుల నుంచి తుపాకీ లాక్కునేందుకు అదిల్ యత్నించారు. హార్స్ రైడర్ అయిన ఆయన ప్రాణాలను పణంగా పెట్టి టూరిస్టులను కాపాడే ప్రయత్నం చేశారు. ఆయన ధైర్యసాహసాలను గుర్తించిన ప్రభుత్వం ₹లక్ష నగదుతో పాటు అవార్డును వారి ఫ్యామిలీకి అందజేసింది.

News January 26, 2026

నేషనల్ అవార్డ్ విన్నర్‌తో మోహన్‌లాల్ కొత్త సినిమా

image

రిపబ్లిక్ డే సందర్భంగా మోహన్ లాల్ తన 367వ సినిమాను ప్రకటించారు. నేషనల్ అవార్డ్ విన్నర్ విష్ణు మోహన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీని ‘శ్రీ గోకులం మూవీస్’ బ్యానర్‌పై గోకులం గోపాలన్ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 2న ‘దృశ్యం 3’తో రాబోతున్న మోహన్ లాల్.. మమ్ముట్టితో కలిసి ‘పేట్రియాట్’ చిత్రంలోనూ నటిస్తున్నారు. తాజా ప్రాజెక్ట్ ఆపరేషన్ గంగా నేపథ్యంలో సాగే థ్రిల్లర్ అని సమాచారం.