News December 30, 2024

సిఫారసు లేఖల వ్యవహారం: రేవంత్ రెడ్డికి సీఎం చంద్రబాబు లేఖ

image

AP: తిరుమల శ్రీవారి దర్శనం కోసం తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖల వ్యవహారంపై ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. ఇకపై వారి సిఫారసు లేఖలను అనుమతిస్తామని తెలిపారు. ప్రతివారం(సోమవారం నుంచి గురువారం) ఏదైనా రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనం, ప్రత్యేక దర్శనం కోసం రెండు లేఖలను అంగీకరిస్తామని పేర్కొన్నారు.

Similar News

News January 2, 2025

బుక్ చేసిన 10 నిమిషాల్లో అంబులెన్స్

image

క్విక్ కామర్స్ సంస్థ ‘బ్లింకిట్’ అంబులెన్స్ సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. బుక్ చేసిన 10 నిమిషాల్లోనే అంబులెన్స్ వస్తుందని ఆ సంస్థ సీఈవో అల్బిందర్ ప్రకటించారు. తొలుత గురుగ్రామ్ నగరంలో ఐదు అంబులెన్సులతో ఈ సర్వీస్‌ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. అంబులెన్సులో ఆక్సిజన్ సిలిండర్లు, మానిటర్, పారామెడిక్, సహాయకుడు, లైఫ్ సేవింగ్ ఎక్విప్‌మెంట్ ఉంటాయి.

News January 2, 2025

అంద‌రూ సిగ్గుప‌డాలి.. మద్రాస్ హైకోర్టు ఆగ్రహం

image

లింగం, కులాల ఆధారంగా వివక్ష కొనసాగుతున్న సమాజంలో జీవిస్తున్నందుకు అంద‌రం సిగ్గుపడాలని మద్రాస్ HC జడ్జి జస్టిస్ వెల్మురుగన్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చెన్నైలోని అన్నా వ‌ర్సిటీలో విద్యార్థినిపై లైంగిక దాడి ఘ‌ట‌న‌పై నిర‌స‌నకు అనుమ‌తివ్వాలని PMK పార్టీ కోర్టుకెక్కింది. రాజ‌కీయ పార్టీల నిర‌స‌న‌లు మీడియా దృష్టిని ఆక‌ర్షించ‌డానికే త‌ప్పా స‌దుద్దేశాల‌తో కాద‌ని ఘాటుగా స్పందిస్తూ పిటిషన్‌ను కొట్టేసింది.

News January 2, 2025

భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ?

image

ఆస్ట్రేలియాతో జరుగుతున్న BGT తర్వాత రోహిత్ శర్మ టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలుగుతారని జాతీయ మీడియా పేర్కొంది. సొంతగడ్డలో న్యూజిలాండ్‌పై, AUSలో BGT టెస్టులో పేలవ ప్రదర్శనతో శర్మపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. ఈక్రమంలో విరాట్ కోహ్లీ తిరిగి సారథ్యం వహించే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. కోహ్లీ టెస్టు కెప్టెన్‌గా 68 మ్యాచులు ఆడగా భారత్‌ను 40 మ్యాచుల్లో గెలిపించారు.