News April 21, 2025
తిరుమలలో పనిచేయని సిఫార్సు లేఖలు!

AP: వేసవిలో భక్తుల రద్దీ దృష్ట్యా ప్రజాప్రతినిధులు, IAS, IPS, ఇతర ప్రభుత్వ అధికారుల సిఫార్సు లేఖలను TTD తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. దీంతో లేఖలతో వచ్చిన భక్తుల పరిస్థితి అయోమయంగా మారింది. ఏటా ఏప్రిల్ 15 నుంచి 3 నెలల పాటు సిఫార్సు లేఖలు స్వీకరించరు. కానీ దీనిపై అధికారిక ప్రకటన రాకపోవడంతో భక్తులు లేఖలతో శ్రీవారి దర్శనానికి క్యూ కడుతున్నారు.
Similar News
News April 21, 2025
న్యాయమూర్తుల బదిలీకి కొలీజియం సిఫారసు

ఏపీ, తెలంగాణ, కర్ణాటక హైకోర్టుల నుంచి పలువురు న్యాయమూర్తుల బదిలీకి కొలీజియం సిఫార్సు చేసింది. ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ కె.మన్మథరావు కర్ణాటక హైకోర్టుకు, తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ సురేందర్ మద్రాస్ హైకోర్టుకు, తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ శ్రీసుధ కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఏప్రిల్ 15, 19 తేదీల్లో జరిగిన సమావేశాల్లో కొలీజియం నిర్ణయం తీసుకుంది.
News April 21, 2025
రావణుడొచ్చేస్తున్నాడు!

రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి నటిస్తోన్న ‘రామాయణ’ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. రావణుడి పాత్రలో నటిస్తోన్న యష్ ఈ వారంలోనే షూటింగ్‌లో పాల్గొంటారని సినీవర్గాలు తెలిపాయి. అంతకుముందు ఆయన ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించారని పేర్కొన్నాయి. ఇప్పటికే ఆయన ‘టాక్సిక్’ సినిమా షూటింగ్ పూర్తిచేసుకున్నట్లు తెలుస్తోంది. ‘రామాయణ’ చిత్రాన్ని నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్నారు.
News April 21, 2025
BCCI కాంట్రాక్ట్.. శ్రేయస్ సూపర్ కమ్‌బ్యాక్

గతేడాది BCCI సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన ఫామ్‌తో తిరిగి రిటైనర్‌షిప్ దక్కించుకున్నారు. CTలో IND తరఫున అత్యధిక రన్స్ చేయడంతో పాటు KKRకు IPL ట్రోఫీ అందించారు. డొమెస్టిక్ క్రికెట్‌లోనూ పరుగుల వరద పారించారు. దీంతో BCCI అతడిని B కేటగిరీలో చేర్చింది. ఇక క్రమశిక్షణ ఉల్లంఘనలతో గతేడాది కాంట్రాక్ట్ కోల్పోయిన ఇషాన్‌పై BCCI కరుణ చూపింది. అతడిని C కేటగిరీలో చేర్చింది.