News December 28, 2024

RECORD:10 నిమిషాలకో ₹50L కారు అమ్మకం

image

సంపద, సంపన్నులు పెరగడంతో లగ్జరీ కార్ల అమ్మకాల్లో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. 2024లో ప్రతి 10 నిమిషాలకో ₹50L పైబడిన కారును అమ్మింది. తొలిసారి ఒక ఏడాదిలో 50వేల లగ్జరీ కార్ల ఘనతను అందుకుంది. 2025లో 54వేలకు చేరుతుందని ఇండస్ట్రీ వర్గాల అంచనా. 2024లో మెర్సిడెస్ బెంజ్ 20వేలు, BMW 12వేల కార్లను అమ్మినట్టు సమాచారం. ఇవి సగటున 15% గ్రోత్ నమోదు చేశాయి. వివిధ కారణాలతో AUDI కార్ల సేల్స్ 16% తగ్గాయి.

Similar News

News January 21, 2026

పిల్లలు బరువు కాదు.. భవిష్యత్తు!

image

US ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్-ఉష దంపతులు నాలుగో <<18911938>>బిడ్డకు<<>> జన్మనివ్వనుండటం చర్చకు దారితీసింది. ఎక్కువ మంది పిల్లల్ని కనాలంటూ తమ దేశ ప్రజలకు ఇలా సందేశం ఇచ్చారని విశ్లేషకులు భావిస్తున్నారు. పిల్లల్ని బరువుగా కాకుండా భవిష్యత్తుగా భావించాలని అక్కడి ప్రభుత్వాల సూచన. అయితే మన దేశంలోనూ ఎక్కువ మంది పిల్లల్ని కనాలని రాజకీయ నేతలు చెబుతున్నా ఆర్థిక స్తోమత లేదని మధ్యతరగతి ప్రజలు అంటున్నారు. మీ COMMENT

News January 21, 2026

ఆల్ టైమ్ కనిష్ఠానికి రూపాయి విలువ

image

అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఆల్ టైమ్ కనిష్ఠానికి చేరింది. ప్రస్తుతం డాలర్‌తో కంపేర్ చేస్తే రూ.91.74కు సమానంగా ఉంది. అమెరికా-గ్రీన్‌లాండ్ ఉద్రిక్తతల నడుమ భారతీయ ఈక్విటీల నుంచి విదేశీ పెట్టుబడిదారులు నిరంతరం అమ్మకాలు జరిపారు. దీంతో మార్కెట్లు కుదేలై రూపాయి పతనం వైపు నడిచింది. అటు 2026లో రూపాయి విలువ 1.98% మేర పడిపోయింది. ఆసియాలో పతనమైన కరెన్సీలో ఇది రెండో ప్లేస్‌లో ఉంది.

News January 21, 2026

కుమారస్వామిని ఆరాధిస్తే..

image

కుమారస్వామిని ఆరాధించడం వల్ల అనేక శుభాలు కలుగుతాయి. ఆయనను కొలిస్తే శత్రుభయం, కోర్టు సమస్యల నుంచి విముక్తి లభించి విజయాలు వరిస్తాయి. సునిశిత బుద్ధికి ప్రతీక అయిన ఆయన ‘వేలు’ (శూలం) పిల్లలకు చదువు, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అలాగే కుజ దోష నివారణకు, సంతాన ప్రాప్తికి, ఆధ్యాత్మిక ఉన్నతికి షణ్ముఖుని పూజ ఉత్తమమైన మార్గం. సర్ప రూపంలో ఆయనను ఆరాధించడం కుండలిని శక్తిని జాగృతం చేసి యోగ సాధనకు తోడ్పడుతుంది.