News November 30, 2025
RECORD: 20 ఓవర్లలో 310 రన్స్

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బెంగాల్‌పై పంజాబ్ 20 ఓవర్లలో 310/5 స్కోర్ చేసింది. టోర్నీ చరిత్రలో ఇదే సెకండ్ హయ్యెస్ట్ స్కోర్. అభిషేక్ శర్మ 148, ప్రభ్‌సిమ్రాన్ 70, రమణ్‌దీప్ 39 రన్స్ చేశారు. ఈ ఇన్నింగ్స్‌లో పంజాబ్ బ్యాటర్లు 28 సిక్సులు బాదారు. కాగా T20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన బ్యాటర్లలో అభిషేక్ రెండో స్థానంలో నిలిచారు. గత ఏడాది SMATలో 151 రన్స్ చేసిన తిలక్ వర్మ తొలి స్థానంలో ఉన్నారు.
Similar News
News March 28, 2026
యుద్ధం ఇంకొన్ని వారాలే: అమెరికా

పశ్చిమాసియా యుద్ధం కొన్నివారాల్లోనే ముగియనుందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న మిలిటరీ యాక్షన్స్ అనుకున్న సమయం కంటే వేగంగానే టార్గెట్‌ను రీచ్ అవుతున్నాయని, ఈ యుద్ధం నెలల తరబడి కొనసాగదని స్పష్టం చేశారు. ఈ పోరాటంలోకి అమెరికా గ్రౌండ్ ఫోర్సెస్‌ను రంగంలోకి దించాల్సిన అవసరం లేదని, వ్యూహాత్మక చర్యలతోనే శత్రువును దెబ్బకొడతామని వెల్లడించారు.
News March 28, 2026
కొలెస్ట్రాల్ నార్మల్ ఉన్నా గుండెపోటు ముప్పు

చాలామంది బ్లడ్ టెస్టుల్లో కేవలం HDL, LDL మాత్రమే చూసుకుంటారు. అయితే కొలెస్ట్రాల్ నార్మల్ ఉన్నా గుండెపోటు రావడానికి లిపోప్రోటీన్(a) లేదా Lp(a) ప్రధాన కారణమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది జన్యుపరంగా వస్తుంది కాబట్టి ఆహారం, వ్యాయామంతో సంబంధం లేకుండా పుట్టుకతోనే శరీరంలో స్థిరంగా ఉంటుంది. ఇది రక్తనాళాల్లో పూడికలు, రక్తం గడ్డకట్టే రిస్క్‌ను పెంచుతుంది. భారతీయులలో ఈ ముప్పు మరీ ఎక్కువ.
News March 28, 2026
గోల్ఫ్ స్టార్ టైగర్ వుడ్స్ అరెస్ట్

గోల్ఫ్ స్టార్ టైగర్ వుడ్స్ ఫ్లోరిడాలో జరిగిన కారు ప్రమాదం తర్వాత ‘డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్’ (DUI) కింద అరెస్ట్ అయ్యారు. ఆయన నడుపుతున్న కారు ఒక ట్రక్కును ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో వుడ్స్ క్షేమంగా బయటపడ్డారు. అయితే ఆయన డ్రింక్ చేయలేదని బ్రీత్ అనలైజర్ టెస్టులో తేలినప్పటికీ మూత్ర పరీక్ష చేయడానికి నిరాకరించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఏదైనా డ్రగ్స్ వాడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.


