News April 3, 2024

ఐపీఎల్‌ చరిత్రలో తొలి ప్లేయర్‌గా రికార్డు

image

లక్నో సూపర్ జెయింట్స్(LSG) బౌలర్ మయాంక్ యాదవ్ అరుదైన రికార్డు నెలకొల్పారు. ఐపీఎల్ చరిత్రలో ఆడిన తొలి రెండు మ్యాచుల్లో POTM అవార్డు అందుకున్న తొలి ప్లేయర్‌గా నిలిచారు. ఈ సీజన్‌లోనే అరంగేట్రం చేసిన మయాంక్ 150KMPH పైగా బంతులు విసురుతూ సెన్సేషన్‌గా మారారు. పంజాబ్‌, ఆర్సీబీతో మ్యాచుల్లో ఆరు వికెట్లు తీశారు.

Similar News

News October 7, 2024

ఏడుగురు సజీవదహనానికి దీపమే కారణం

image

ముంబైలోని ఓ ఇంట్లో నిన్న <<14286158>>అగ్నిప్రమాదంలో<<>> ఏడుగురు సజీవదహనమైన ఘటనలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. దుర్గా నవరాత్రి సందర్భంగా ఇంట్లో వెలిగించిన దీపమే ఘోర విషాదానికి కారణమని అధికారులు గుర్తించారు. రెండంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో దీపం వల్ల మంటలు చెలరేగాయి. అందులోని కిరాణా షాపులో 25 లీటర్ల కిరోసిన్‌ను నిల్వ ఉంచారు. దీంతో మంటలు వేగంగా వ్యాపించాయి. నిద్రలోనే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

News October 7, 2024

మహాచండీ దేవి రూపంలో దుర్గమ్మ దర్శనం

image

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు విజయవాడ దుర్గమ్మ మహాచండీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. ఈ దేవి అనుగ్రహంతో విద్య, కీర్తి, సంపదలు లభిస్తాయని భక్తుల నమ్మకం. దుష్టశిక్షణ, శిష్ట రక్షణకు మహాలక్ష్మీ, మహాకాళీ, మహా సరస్వతి త్రిశక్తి స్వరూపిణిగా మహాచండీ అమ్మవారు ఉద్భవించారు. మరోవైపు వరంగల్ జిల్లా భద్రకాళీ దేవస్థానంలో లలిత మహాత్రిపుర సుందరి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు.

News October 7, 2024

బంగ్లాపై గెలుపు.. టీమ్ ఇండియా రికార్డులు

image

తొలి T20లో బంగ్లాదేశ్‌పై ఘన <<14290970>>విజయం<<>> సాధించిన టీమ్ ఇండియా పలు రికార్డులు సృష్టించింది. ప్రత్యర్థి జట్లను అత్యధికసార్లు(42) ఆలౌట్ చేసిన టీమ్‌గా పాక్ వరల్డ్ రికార్డును సమం చేసింది. ఆ తర్వాత కివీస్(40), ఉగాండా(35), విండీస్(32) ఉన్నాయి. అలాగే 120+ పరుగుల లక్ష్యాన్ని భారత్ అత్యంత వేగంగా(11.5 ఓవర్లు) ఛేజ్ చేసింది. సూర్య సేనకు ఇదే ఫాస్టెస్ట్ ఛేజ్. 2016లో బంగ్లాపైనే 13.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేజ్ చేసింది.