News August 29, 2024
రికార్డు బ్రేక్: అంబానీని దాటేసిన అదానీ

గౌతమ్ అదానీ రికార్డు సృష్టించారు. RIL అధినేత ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టారు. హురూన్ ఇండియా రిచ్లిస్ట్లో నం.1గా నిలిచారు. నిరుడుతో పోలిస్తే అంబానీ కుటుంబ సంపద 25% వృద్ధిచెంది రూ.10.14 లక్షల కోట్లకు చేరింది. అదానీ కుటుంబ ఆదాయం 95% వృద్ధిరేటుతో రూ.11.61 లక్షల కోట్లకు ఎగిసింది. ఇక శివనాడార్, సైరస్ పూనావాలా, దిలీప్ సంఘ్వి, బిర్లా, హిందూజా, దమానీ, ప్రేమ్జీ, నీరజ్ బజాజ్ కుటుంబాలు టాప్-10లో ఉన్నాయి.
Similar News
News November 28, 2025
తాటిపర్తి: పుట్టిన రోజు వేడుకలో గొడవ.. వ్యక్తి మృతి

తాటిపర్తిలో గురువారం రాత్రి జరిగిన వాగ్వాదం విషాదంగా మారింది. శ్రీమంతుల దయ మనుమరాలు పుట్టినరోజు వేడుకల్లో రోడ్డుపై పెట్టిన బల్లను కృష్ణవేణి అనే మహిళ అటుగా వెళ్తూ బల్లలకు తగలడంతో బల్ల పడిపోయింది. దీంతో రెండు కుటుంబాల మధ్య గొడవ మొదలైంది. ఈ వాగ్వాదం జరుగుతుండగా వెంపల సూరి బాబు (59) ఆకస్మాత్తుగా కుప్పకూలి మరణించాడు. ఈ ఘటనపై గొల్లప్రోలు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 28, 2025
హనుమాన్ చాలీసా భావం – 23

ఆపన తేజ సమ్హారో ఆపై|
తీనోం లోక హాంక తే కాంపై||
హనుమంతుడి తేజస్సు ఎంత శక్తిమంతమైనదంటే.. దానిని కేవలం ఆయనే మాత్రమే స్వయంగా నియంత్రించుకోగలడు. ఆయన పెట్టే ఒక్క కేకకు 3 లోకాలు సైతం భయంతో కంపించిపోతాయి. లోకాలను శాసించగల మహాశక్తిని కలిగిన ఆంజనేయుడు శాంతి స్వరూపుడు కూడా! ఆ అపారమైన శక్తిని మనం పూజించినా, కాపాడమని శరణు వేడినా.. తప్పక రక్షిస్తాడు. <<-se>>#HANUMANCHALISA<<>>
News November 28, 2025
APPLY NOW: NCPORలో ఉద్యోగాలు

నేషనల్ సెంటర్ ఫర్ పోలార్&ఓషియన్ రీసెర్చ్(NCPOR) 5 ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 15న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. జీతం నెలకు రూ.56వేలు+HRA చెల్లిస్తారు. వెబ్సైట్: https://ncpor.res.in/


