News February 13, 2025

RECORD: 82 లీటర్ల పాలు ఇచ్చిన ఆవు

image

సాధారణంగా ఒక్క ఆవు మహా అంటే 5 నుంచి 10 లీటర్ల పాలు ఇస్తుంటుంది. కానీ, పంజాబ్‌కు చెందిన ఓ ఆవు ఏకంగా 82 లీటర్ల పాలను ఉత్పత్తి చేసి జాతీయ రికార్డు సృష్టించింది. లూథియానాలోని 18వ అంతర్జాతీయ PDFA డైరీ & అగ్రి ఎక్స్‌పోలో హోల్‌స్టెయిన్ ఫ్రైసియన్ జాతి ఆవు 24 గంటల్లో 82 లీటర్ల పాలు ఉత్పత్తి చేసి ఆశ్చర్యపరిచింది. ఇది పంజాబ్ పశువుల పెంపకం, వాటి పాల సామర్థ్యాన్ని ప్రదర్శించింది.

Similar News

News November 10, 2025

మొంథా తుఫాన్.. 1,64,505 హెక్టార్లలో పంట నష్టం

image

AP: మొంథా తుఫాన్ వల్ల రాష్ట్రంలోని 24 జిల్లాల్లో 1,64,505 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ గుర్తించింది. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 31వేల హెక్టార్లలో, కోనసీమలో 29,537, కాకినాడలో 21,422 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. తుఫాన్ ప్రభావిత 6 జిల్లాల్లో కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పౌసుమీ బసు నేతృత్వంలోని 8 మంది సభ్యుల బృందం.. ఇవాళ, రేపు పర్యటించి పంట నష్టంపై కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది.

News November 10, 2025

మెగాస్టార్ సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్!

image

స్వింగ్ జరా, కావాలయ్యా వంటి సూపర్‌హిట్ సాంగ్స్‌తో యూత్‌ను అట్రాక్ట్ చేసిన మిల్కీ బ్యూటీ తమన్నా మరోసారి సిల్వర్ స్క్రీన్‌ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనున్నట్టు టాక్. ప్రత్యేక సెట్‌లో సాంగ్‌ షూట్ చేయడానికి అనిల్ రెడీ అవుతున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News November 10, 2025

APPLY NOW: జర్మనీలో మెకానిక్ ఉద్యోగాలు

image

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జర్మనీలో మెకానిక్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఐటీఐ/డిప్లొమా/బీటెక్ అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఇవాళ్టి వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. నెలకు రూ.2.50లక్షల నుంచి రూ.3 లక్షల వరకు జీతం చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://naipunyam.ap.gov.in/