News November 17, 2024
కాళేశ్వరంతో సంబంధం లేకుండా రికార్డుస్థాయిలో ధాన్యం: CM

కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం లేకుండా తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రికార్డు స్థాయిలో వరిధాన్యం పండిందని CM రేవంత్ తెలిపారు. 2024లో 66.77లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరిసాగైందని, 153 లక్షల టన్నుల ఉత్పత్తి వచ్చిందనే వార్తను ట్వీట్ చేశారు. ‘కాళేశ్వరం వల్లే వరిసాగు పెరిగిందన్న BRS తప్పుడు ప్రచారం పటాపంచలైంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో నీటిని నిల్వ చేయకపోయినా రైతులు ఈ ఘనత సాధించారు’ అని తెలిపారు.
Similar News
News January 20, 2026
విమాన ఛార్జీల పెంపు.. కేంద్రం, DGCAకి సుప్రీంకోర్టు నోటీసులు

పండుగల సమయంలో విమాన ఛార్జీలను పెంచుతూ ఎయిర్‌లైన్స్ దోపిడీకి పాల్పడుతున్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రైవేట్ ఎయిర్ లైన్స్ ఛార్జీల పెంపును నియంత్రించాలంటూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ విక్రమ్ నాథ్, సందీప్ మెహతా ధర్మాసనం విచారించింది. ‘మేము కచ్చితంగా ఈ విషయంలో జోక్యం చేసుకుంటాం’ అని స్పష్టం చేసింది. దీనిపై రిప్లైలు కోరుతూ కేంద్రం, DGCAకి నోటీసులిచ్చింది.
News January 20, 2026
గుజరాత్‌పై RCB ఘన విజయం

WPLలో RCB హవా కొనసాగుతోంది. గుజరాత్‌పై 61 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. 179 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో GG జట్టు తడబడింది. కెప్టెన్ గార్డ్‌నర్(54) ఒంటరి పోరాటం వృథా అయ్యింది. మిగిలిన బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించలేదు. RCB బౌలర్లలో సయాలి 3, నాడిన్ డి క్లెర్క్ 2, లారెన్ బెల్, రాధా యాదవ్, శ్రేయాంక తలో వికెట్ తీశారు. RCB వరుసగా 5 విజయాలు సాధించి 10 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది.
News January 20, 2026
వడ్డీ లేని రుణాల పంపిణీని వేగంగా పూర్తి చేయండి: భట్టి

TG: మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీని వేగంగా పూర్తి చేయాలని అధికారులను Dy.CM భట్టి విక్రమార్క ఆదేశించారు. వడ్డీలేని రుణాలు, ఇందిరమ్మ చీరలపై మంత్రులు, అధికారులతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సంఘాల్లో లేని మహిళలను రేషన్ కార్డు ఆధారంగా గుర్తించి చీరలను అందజేయాలన్నారు. ఈరోజు మధిరలో భట్టి, నల్గొండ మున్సిపాలిటీలో మంత్రి కోమటిరెడ్డి మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశారు.


