News April 11, 2025
RECORD: అజిత్ కెరీర్లో హైయెస్ట్ కలెక్షన్స్

అజిత్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా నిన్న తొలి రోజు తమిళనాడులో రూ.30.9 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఆయన కెరీర్లో ఫస్ట్ డే కలెక్షన్స్‌లో ఇదే అత్యధికం అని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా నిన్న ఒక్క రోజే రూ.50 కోట్ల వరకు రాబట్టినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో త్రిష, అర్జున్ దాస్, సిమ్రన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Similar News
News November 28, 2025
తులసి ఆకులను నమలకూడదా?

తులసి ఔషధ గుణాలు కలిగిన మొక్కగా గుర్తింపు పొందింది. అయితే ఈ మొక్క ఆకులను నమలకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే.. తులసి ఆకుల్లో ఆర్సెనిక్ అనే రసాయనం ఉంటుంది. ఇది పంటిపై ఉన్న ఎనామెల్‌ను దెబ్బతీస్తుంది. ఫలితంగా పళ్ల రంగు మారవచ్చు. అయితే ఆకులను నమలకుండా మింగితే ఎన్నో రోగాలు నయమవుతాయని సైంటిస్టులు చెబుతున్నారు. జలుబు, దగ్గుతో పోరాడి తులసి క్రిమిసంహారిణిగా పనిచేస్తుంది.
News November 28, 2025
ఆ దేశాల నుంచి ఎవరినీ రానివ్వం: ట్రంప్

థర్డ్ వరల్డ్ కంట్రీస్(అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందని) నుంచి శాశ్వతంగా మైగ్రేషన్ నిలుపుదల చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ‘US సిస్టమ్ పూర్తిగా కోలుకునేందుకు ఇది తప్పనిసరి. బైడెన్ హయాంలో వచ్చిన అందరు అక్రమ వలసదారులను, దేశానికి ఉపయోగపడని వారిని, నేరాలు చేసిన వారిని పంపేయాలి. నాన్ సిటిజన్స్‌కు సబ్సిడీలు, ఫెడరల్ బెనిఫిట్స్ రద్దు చేయాలి’ అని తెలిపారు.
News November 28, 2025
మట్టి పాత్రలు ఎలా వాడాలంటే?

ప్రస్తుతం చాలామంది మట్టిపాత్రలు వాడటానికి మొగ్గు చూపుతున్నారు. అయితే వీటి వాడకంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు. కొత్త మట్టిపాత్రను వాడేముందు సీజనింగ్ చేయాలి. రోజంతా నీళ్లలో నానబెట్టి ఆరాక పూర్తిగా నూనె రాసి ఆరనివ్వాలి. కుండను చిన్న సెగ మీద ఉంచి మంటను పెంచుతూ వెళ్లాలి. వీటిలో ఆహారం కూడా చాలా సేపు వేడిగా ఉంటుంది. వీటిని క్లీన్ చేయడానికి ఇసుక, సున్నిపిండి, బూడిద, కుంకుడు రసం వాడాలి.


