News March 31, 2024

రికార్డు సృష్టించిన రషీద్ ఖాన్

image

గుజరాత్ టైటాన్స్ స్పిన్నర్ రషీద్ ఖాన్ రికార్డు నెలకొల్పారు. GT తరఫున అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్‌గా నిలిచారు. తాజాగా SRH‌తో మ్యాచులో క్లాసెన్ వికెట్ తీయడంతో ఈ ఘనత అందుకున్నారు. రషీద్ ఇప్పటివరకు గుజరాత్ తరఫున 49 వికెట్లు తీశారు. ఆ తర్వాతి స్థానంలో స్టార్ బౌలర్ షమీ(48) ఉన్నారు. గాయం కారణంగా షమీ ఈ సీజన్‌కు దూరమైన సంగతి తెలిసిందే.

Similar News

News March 25, 2026

మహిళల్లో ఈస్ట్రోజన్ తగ్గితే.. ఈ ఫుడ్ తీసుకోండి

image

అవయవాల పనితీరును సమన్వయపరిచే హార్మోన్లలో ఈస్ట్రోజన్ ఒకటి. ఇది తగ్గడం వల్ల మహిళల్లో నెలసరి అస్తవ్యస్తం, మూడ్ స్వింగ్స్, డిప్రెషన్, తలనొప్పి, చర్మం పొడిబారడం, అధికబరువు వంటి సమస్యలు వస్తాయి. ఈస్ట్రోజన్ పెరగాలంటే టోపు, సోయా, బఠాణీలు, అప్రికాట్స్, బ్రొకలీ, కాలీఫ్లవర్, ఫ్లాక్స్, గుమ్మడి సీడ్స్, పెసర మొలకలు తినాలి. తక్కువ బరువు ఉన్నా, అవసరానికి మించి వ్యాయామం చేసినా ఈస్ట్రోజన్ తగ్గుతుంది.

News March 25, 2026

టీనేజ్ పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?

image

అప్పటివరకు సంతోషంగా, చురుగ్గా ఉండే కొందరు పిల్లలు కాలేజీకి వెళ్లగానే సైలెంట్‌ ఐపోతారు. పిల్లల ప్రవర్తనలో ఇలాంటి మార్పును వెంటనే గుర్తించాలంటున్నారు నిపుణులు. వేధింపులకు గురవుతున్నారేమో పరిశీలించాలి. ఫ్రెండ్లీగా మాట్లాడి సమాచారం రాబట్టాలి. భయాన్ని పోగొట్టి, తామున్నామనే భరోసా, నమ్మకాన్ని తల్లిదండ్రులు కలిగించాలి. ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొనేలా ఆత్మవిశ్వాసాన్ని పెంచాలని సూచిస్తున్నారు.

News March 25, 2026

SRHకు కావ్య, RCBకి అనన్య

image

IPLలో సన్‌రైజర్స్ ఓనర్ కావ్యా మారన్ ప్రత్యేక ఆకర్షణగా మారగా ఇప్పుడు ఆమెకు పోటీగా మరొకరు రానున్నట్లు తెలుస్తోంది. ఆర్సీబీని ఆదిత్య బిర్లా కన్సార్షియం రూ.16,725 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ ఫ్రాంచైజీ ఛైర్మన్ ఆర్యమాన్ బిర్లా సోదరి అనన్య బిర్లా యాక్టివ్‌గా మారి, మ్యాచులు చూసేందుకు వస్తారని వార్తలు వస్తున్నాయి. దీంతో ఆమె గురించి నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.