News May 14, 2024

శ్రీనగర్‌లో 35 ఏళ్లకు రికార్డు పోలింగ్

image

జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ లోక్‌సభ స్థానంలో రాత్రి వరకు 37.98శాతం పోలింగ్ నమోదైంది. 35 ఏళ్లలో ఇదే గరిష్ఠమని అధికారులు తెలిపారు. ఈ ఓటింగ్‌పై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370 రద్దుపై ప్రజల నుంచి వచ్చిన స్పందనకు నిదర్శనమన్నారు. గత ఎన్నికల్లో 14 శాతమే ఓటింగ్ జరిగింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత శ్రీనగర్‌లో తొలి ఎన్నిక ఇదే కావడం గమనార్హం.

Similar News

News March 5, 2026

ఇరాన్‌తో యుద్ధం.. 10కి 15 మార్కులేసిన ట్రంప్

image

ఇరాన్‌పై చేస్తున్న యుద్ధంలో అమెరికా మిలిటరీ అసామాన్యంగా పోరాడుతోందని ట్రంప్ కొనియాడారు. ఈ సందర్భంగా తమ దేశ సైన్యానికి 10కి 15 మార్కులేశారు. తమతో పాటు ఇరాన్‌పై యుద్ధం చేస్తున్న మిత్రదేశాలు ఇప్పటికే పైచేయి సాధించాయని చెప్పారు. ప్రస్తుతం తాము కమాండింగ్ పొజిషన్‌లో ఉన్నామన్నారు. ఈ యుద్ధంలో వెయ్యి మందికి పైగా ఇరానియన్స్ చనిపోయినట్లు US హ్యూమన్ రైట్స్ గ్రూప్ చెబుతోంది.

News March 5, 2026

ముంబై పోర్ట్ అథారిటీలో 26 పోస్టులు

image

<>ముంబై<<>> పోర్ట్ అథారిటీ 26 స్పెషలిస్ట్/ సూపర్ స్పెషలిస్ట్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి MBBSతో పాటు సంబంధిత విభాగంలో MD/DNB, DM, DrNB, పీజీ డిప్లొమా, M.Ch., MS, MDS అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 12 వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. వెబ్‌సైట్: https://mumbaiport.gov.in

News March 5, 2026

4 రోజుల్లో రూ.9,560 తగ్గిన 10గ్రా.ల గోల్డ్ రేటు

image

బంగారం, వెండి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ వీటి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.980 తగ్గి రూ.1,63,530కు చేరింది. నాలుగు రోజుల్లోనే రూ.9,560 తగ్గడం విశేషం. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.900 పతనమై రూ.1,49,900 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. ప్రస్తుతం కేజీ సిల్వర్ రేటు రూ.2,95,000గా ఉంది.