News March 30, 2024
రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం

హైదరాబాద్ పరిధిలో నిన్న రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం జరిగింది. నిన్న ఒకరోజే 79.48 మిలియన్ యూనిట్ల కరెంట్ను ప్రజలు వాడారని విద్యుత్ అధికారులు తెలిపారు. గత ఏడాది మే నెలలో సుమారు ఈ స్థాయిలోనే వినియోగం జరగగా.. ఈసారి మార్చికే రికార్డు రావడం గమనార్హం. ఈ సీజన్లో వినియోగం 90 మిలియన్ యూనిట్లకు చేరే అవకాశం ఉందంటున్నారు అధికారులు. ఎండలు, పారిశ్రామిక, వ్యవసాయ అవసరాలే దీనికి కారణం కావొచ్చంటున్నారు.
Similar News
News December 5, 2025
రేపు వాయిదా పడిన డిగ్రీ పరీక్ష నిర్వహణ

యోగివేమన విశ్వవిద్యాలయ పరిధిలో డిసెంబర్ 1న మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించాల్సిన పరీక్ష తుఫాను కారణంగా వాయిదా పడింది. ఆరోజు జరగాల్సిన పరీక్ష ఈ నెల 6న ఉదయం 9 గంటలకు నిర్వహించనున్నట్లు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ నారాయణరెడ్డి శుక్రవారం తెలిపారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని సూచించారు. ప్రతి విద్యార్థి పరీక్షకు తప్పక హాజరు కావాలన్నారు.
News December 5, 2025
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకెక్కిన సీఎం నితీశ్

బిహార్ CM నితీశ్ కుమార్ అరుదైన ఘనత సాధించారు. ఇటీవల పదోసారి CMగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఆయన పేరు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్(లండన్)లో చేరినట్లు JDU తెలిపింది. 2000లో తొలిసారి CM అయిన నితీశ్ వారం రోజులే పదవిలో ఉన్నారు. తర్వాత 2005 నుంచి వరుసగా 5సార్లు సీఎం అయ్యారు. సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాలతో పలుమార్లు రాజీనామాలు చేసి మళ్లీ ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించారు.
News December 5, 2025
కప్పు పట్టేస్తారా? పట్టు విడుస్తారా?

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కోల్పోయిన IND 3 వన్డేల సిరీస్లో తొలి మ్యాచు గెలిచి ఊపు మీద కనిపించింది. దీంతో ఇంకొక్క మ్యాచ్ గెలిస్తే సిరీస్ మనదే అనుకున్నారంతా. కానీ బౌలింగ్ ఫెయిల్యూర్, చెత్త ఫీల్డింగ్తో రెండో వన్డేను చేజార్చుకుంది. దీంతో రేపు విశాఖలో జరిగే చివరి వన్డే కీలకంగా మారింది. మరి భారత ఆటగాళ్లు ఈ మ్యాచులో సమష్టిగా రాణించి, సిరీస్ పట్టేస్తారో లేక SAకు అప్పగిస్తారో చూడాలి.


