News May 25, 2024
RECORD: 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

రాజస్థాన్‌లోని ఫలోడిలో ఈరోజు 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని భారత వాతావరణశాఖ వెల్లడించింది. దేశంలో ఈ ఏడాది ఇదే అత్యధిక ఉష్ణోగ్రత అని అధికారులు తెలిపారు. అదే రాష్ట్రంలోని బర్మర్‌లో 48.8, జైసల్మీర్‌లో 48 డిగ్రీల టెంపరేచర్ రికార్డు అయింది. మే 29 వరకు పశ్చిమ రాజస్థాన్ ప్రాంతాల్లో రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, జాగ్రత్తగా ఉండాలని IMD హెచ్చరించింది.
Similar News
News December 30, 2025
స్వయంకృషి: హాబీ- ఎర్నింగ్

మన అవసరం, అర్హతలతో ఉద్యోగం చేస్తూ హాబీలనూ ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు. కుట్లు-అల్లికలు, వంటలు, బేకింగ్, రచనలు, ట్రావెల్, రీసెర్చ్.. ఇలా హాబీ ఏదైనా మీరు మీ లీజర్ టైమ్ ఎంజాయ్ చేస్తూ దాంతో కూడా మనీ మేకింగ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఈ కామర్స్ సంస్థలు, సోషల్ ప్లాట్‌ఫామ్స్, ఆఫ్‌లైన్లో అయితే పరిచయాలతో మన అభిరుచుల గురించి చెప్పి ఎదుటి వారికి చూపించి క్రమంగా స్ప్రెడ్ చేసుకోవచ్చు.
రోజూ 1Pmకు ఓ బిజినెస్ ఐడియా
News December 30, 2025
DRDO-SSPLలో పెయిడ్ ఇంటర్న్‌షిప్

<
News December 30, 2025
చదువుతో పాటు ‘సెల్ఫ్ డిఫెన్స్’ మస్ట్!

ఆపద ఎటునుంచి వస్తుందో తెలియదు. అందుకే అమ్మాయిలు ఆత్మరక్షణనే ఆయుధంగా మలచుకోవాలి. ఢిల్లీలో తన తల్లిని తోసేసి గొలుసు లాక్కెళ్లిన దొంగను 14 ఏళ్ల దివ్య వెంటాడి కరాటేతో మట్టికరిపించింది. ఈ సాహసం ఒక ఉదాహరణ మాత్రమే. నేటి సమాజంలో కేవలం చదువు ఒక్కటే సరిపోదు. మానవ మృగాలను ఎదుర్కోవడానికి ప్రతి అమ్మాయి సెల్ఫ్ డిఫెన్స్‌లో శిక్షణ పొందడం మంచిది. మీ కుమార్తెలను ధైర్యవంతులుగా తీర్చిదిద్దండి. share it


