News June 13, 2024
రికార్డు సృష్టించిన వెస్టిండీస్

ఇంటర్నేషనల్ టీ20ల్లో వెస్టిండీస్ కొత్త రికార్డు సృష్టించింది. 30 లేదా అంతకంటే తక్కువ పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన తర్వాత అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా నిలిచింది. టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఇవాళ న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచులో ఆ జట్టు 30 రన్స్‌కే 5 వికెట్లు కోల్పోయింది. కానీ 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 149/9 స్కోర్ చేసింది. ఈ మ్యాచులో విండీస్ 13 రన్స్ తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.
Similar News
News January 2, 2026
హలో ఇంట్రోవర్ట్స్.. ఇవాళ మీ రోజే!

ఇవాళ ఇంట్రోవర్ట్స్ డే. అందరిలో ఉండటం కన్నా ఒంటరిగా ఉండేందుకే వీరు ఇష్టపడతారు. ఇంటికొచ్చిన బంధువులతో ఎలా మాట కలపాలి? ఏం అడగాలో కూడా తెలియక సైలెంట్‌గా ఉండిపోతారు. తిండి దగ్గర కూడా మొహమాటపడుతూ ఇబ్బందిపడుతుంటారు. తమ కోపం, బాధ, సంతోషం.. ఏదైనా లోలోపలే దాచుకుంటారు. ఐన్‌స్టీన్ నుంచి ప్రభాస్ వరకు ఎందరో ప్రముఖులు ఇంట్రోవర్ట్సే. మౌనం వీరికి బలహీనత కాదు ఒక గొప్ప శక్తి. మీ గ్యాంగ్‌లో ఇలాంటి వారున్నారా?COMMENT
News January 2, 2026
ఏపీకి రానున్న సోనియా గాంధీ, రాహుల్

AP: ఉపాధి హామీ పథకం పేరు మార్పును నిరసిస్తూ కాంగ్రెస్ అగ్రనేతలు రాష్ట్రానికి రానున్నారు. ఫిబ్రవరి 2న అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం బండ్లపల్లిలో చేపట్టే ఆందోళనల్లో సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్, ప్రియాంక పాల్గొననున్నారు. ఈ గ్రామంలోనే 2006 ఫిబ్రవరి 2న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారు. దీంతో అదే రోజున, అదే ప్రాంతంలో నిరసన చేపట్టాలని నిర్ణయించారు.
News January 2, 2026
రూ.7వేల కోట్లతో హైదరాబాద్‌కు గోదావరి జలాలు: సీఎం రేవంత్

TG: ఏడాదంతా మూసీనదిలో నీళ్లు ప్రవహించడానికి ప్రణాళికలు రచిస్తున్నామని సీఎం రేవంత్ అసెంబ్లీలో తెలిపారు. మూసీ ప్రక్షాళన కన్సల్టెంట్ కోసం గ్లోబల్ టెండర్లు పిలిచామని చెప్పారు. రూ.7వేల కోట్ల ఖర్చుతో గోదావరి నదీ జలాలను (15 టీఎంసీలు) హైదరాబాద్‌కు తరలిస్తామన్నారు. వివిధ రాష్ట్రాల్లో నదీపరివాహక ప్రాంతాల అభివృద్ధిని ఎన్నికల అజెండాగా పెట్టుకున్న బీజేపీ.. ఇక్కడెందుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నించారు.


