News July 1, 2024

RECORD: 10 వికెట్లు పడగొట్టిన స్నేహ్ రానా

image

ఎంఏ చిదంబరం స్టేడియంలో SAతో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో భారత మహిళా ప్లేయర్ స్నేహ్ రానా సంచలనం సృష్టించారు. మొదటి ఇన్నింగ్స్‌లో 8, రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు తీశారు. దీంతో టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో 10 వికెట్లు తీసిన తొలి భారత మహిళా స్పిన్నర్‌గా స్నేహ్ నిలిచారు. ఫాస్ట్ బౌలర్ జులన్ గోస్వామి తర్వాత 10 వికెట్లు తీసిన 2వ భారత క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పారు.

Similar News

News December 7, 2025

పెరిగిన చికెన్ ధరలు

image

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో KG స్కిన్ లెస్ చికెన్ ధర ₹260గా ఉంది. వరంగల్, కామారెడ్డిలోనూ ఇవే రేట్లున్నాయి. విజయవాడ, గుంటూరు, విశాఖ, చిత్తూరులో ₹240-260, ఏలూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ₹220-230 వరకు పలుకుతోంది. ఇక మటన్ కేజీ ₹800-900 వరకు అమ్ముతున్నారు. కోడిగుడ్డు ధర రిటైల్‌లో ఒక్కోటి ₹7-9కి అమ్ముతున్నారు. మరి మీ ఏరియాలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయి?

News December 7, 2025

రాష్ట్రంలో 94 పోస్టులు.. రేపటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

image

తెలంగాణలో 94 Jr జడ్జీ పోస్టుల భర్తీకి రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. వీటిలో 66 డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా, 28 పోస్టులను ట్రాన్స్‌ఫర్ ద్వారా భర్తీ చేయనున్నారు. LLB ఉత్తీర్ణతతో పాటు బార్ కౌన్సిల్‌లో అడ్వకేట్‌గా నమోదు చేసుకున్నవారు DEC 29వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 23- 35ఏళ్ల మధ్య ఉండాలి. స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష, వైవా వోస్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: tshc.gov.in

News December 7, 2025

మీ తోబుట్టువును గౌరవిస్తున్నారా?

image

దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బానధవా|
తం తు దేశం న పశ్యామి యత్ర బాత్రా సహోదరా||
సహోదరుల బంధం గురించి రాముడు పలికిన మాటలివి. ఈ బంధం విశ్వంలో ఎక్కడా దొరకనంత అమూల్యమైనదని దీనర్థం. సోదరులతో చిన్న మనస్పర్ధలు వచ్చినా, సరిచేసుకుని కలిసి ఉండాలి. ఎక్కడికెళ్లినా భార్యలు, బంధువులు దొరుకుతారు కానీ, తోబుట్టువు దొరకరు. అందుకే ఈ బంధాన్ని దేంతో పోల్చలేము. అంత అపురూపమైనది. ఈ బంధాన్ని ఎల్లప్పుడూ గౌరవించుకోవాలి.