News September 23, 2025

ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు

image

అస్సామీ సింగర్ జుబీన్ గార్గ్ అంత్యక్రియలకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ప్రపంచవ్యాప్తంగా నాలుగో అతి పెద్ద ఫ్యూనరల్ గ్యాదరింగ్‌గా దీనిని గుర్తించింది. మైఖేల్ జాక్సన్, పోప్ ఫ్రాన్సిస్, క్వీన్ ఎలిజబెత్-2 తర్వాత ఆయన అంత్యక్రియలకే అంతమంది హాజరయ్యారని పేర్కొంది. ఆ రద్దీతో దుకాణాలు మూసివేయడంతో పాటు ట్రాఫిక్ ఆపేశారని.. లక్షల మంది కన్నీరు కార్చడంతో గువాహటి శోకసంద్రంగా మారిందని తెలిపింది.

Similar News

News September 23, 2025

పవన్ కళ్యాణ్‌కు వైరల్ ఫీవర్

image

AP: ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ బారినపడ్డారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గత రెండు రోజులుగా జ్వరంతో ఇబ్బంది పడుతున్నారని, ఫీవర్‌తోనే నిన్న అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారని తెలిపాయి. నిన్న రాత్రి నుంచి జ్వరం తీవ్రత పెరిగిందని, వైద్యులు పరీక్షలు చేసి చికిత్స అందిస్తున్నారని పేర్కొన్నాయి. విశ్రాంతి అవసరమని సూచించారని వివరించాయి.

News September 23, 2025

ఇంద్రకీలాద్రిపై కోరినన్ని లడ్డూలు: కలెక్టర్

image

AP: దసరా ఉత్సవాలకు విజయవాడ దుర్గగుడిలో అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. ప్రసాద తయారీ కేంద్రాలను తనిఖీ చేశారు. ‘భక్తులు కోరినన్ని లడ్డూలను ప్రసాదంగా అందించేందుకు ఏర్పాట్లు చేశాం. 11 రోజులకు 36 లక్షల లడ్డూలు సిద్ధం చేశాం. రైల్వేస్టేషన్, బస్టాండ్ వంటి ప్రాంతాల్లో విక్రయ కేంద్రాలున్నాయి. మూలా నక్షత్రం రోజున ఉచితంగా ప్రసాదం పంపిణీ చేస్తాం’ అని తెలిపారు.

News September 23, 2025

హైకోర్టును ఆశ్రయించిన స్మితా సబర్వాల్

image

TG: ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ హైకోర్టును ఆశ్రయించారు. ‘కాళేశ్వరం’ ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టులో తన పేరును తొలగించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఆమె సీఎంవో సెక్రటరీగా, నీటిపారుదల శాఖ ఇన్‌ఛార్జి కార్యదర్శిగా పనిచేశారు. గత ఏడాది పీసీ ఘోష్ కమిషన్ ఎదుట విచారణకు కూడా హాజరయ్యారు. ప్రస్తుతం అనారోగ్యం కారణంగా దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు.