News July 18, 2024
నష్టాల నుంచి కోలుకుని భారీ లాభాల్లో ముగిశాయి!

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ట్రేడింగ్‌ను లాభాలతో ముగించాయి. సెన్సెక్స్ 81,343 (+626) వద్ద స్థిరపడింది. మరోవైపు ఆల్ టైమ్ హై (24,837) తాకిన నిఫ్టీ 187 పాయింట్ల లాభంతో 24,800 వద్ద ముగిసింది. LTIM 3.48%, ONGC 2.99% సహా TCS, విప్రో 2 శాతానికిపైగా లాభాలను నమోదు చేయడం మార్కెట్లకు కలిసొచ్చింది. ఓ దశలో నష్టాలను నమోదు చేసిన మార్కెట్లు లాభాలతో క్లోజవడంపై ఇన్వెస్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News December 1, 2025
ఉత్తర హస్తలు వృష్టికి ప్రమాణం

సూర్యుడు ఉత్తర నక్షత్రంలోకి సెప్టెంబర్ మొదటి వారంలో, హస్త నక్షత్రంలోకి సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్ తొలి వారంలో ప్రవేశిస్తాడు. సాధారణంగా SEPT, OCT నెలల్లో వర్షాలు విస్తారంగా కురుస్తాయి. ఈ వర్షాలు వరి పంటకు, ఇతర ఖరీఫ్ పంటలకు చాలా కీలకం. అందుకే ‘ఉత్తర, హస్త నక్షత్రాలలో వర్షాలు కురవడం ఖాయం, అవి కురిస్తేనే పంటలకు నీరు పుష్కలంగా లభిస్తుంది” అనే అర్థంలో ఈ సామెతను పూర్వీకులు ఉపయోగించేవారు.
News December 1, 2025
గంభీర్, రోహిత్ మధ్య లాంగ్ డిస్కషన్

SAతో తొలి వన్డేలో IND గెలుపు అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో గంభీర్, రోహిత్ మధ్య లాంగ్ డిస్కషన్ జరగడం కెమెరా కంట పడింది. 11కే 3 వికెట్లు కోల్పోయిన స్థితి నుంచి దాదాపు మ్యాచ్ గెలిచేంతలా SA జట్టు ఎలా కమ్‌బ్యాక్ చేసిందనే దానిపై చర్చించినట్లు తెలుస్తోంది. మిగిలిన 2 వన్డేల్లో ఆ జట్టును ఎలా కట్టడి చేయాలి, బౌలింగ్‌లో చేసిన తప్పులపై మాట్లాడినట్లు సమాచారం. వీళ్లిద్దరి డిస్కషన్ గురించి మీరేమనుకుంటున్నారు?
News December 1, 2025
నేటి నుంచే పార్లమెంట్ వింటర్ సెషన్స్

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 19 వరకు మొత్తం 15 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ ఉదయం 11 గంటలకు సెషన్స్ ప్రారంభం కానుండగా, ఇటీవల మరణించిన ఎంపీలకు తొలుత సంతాపం తెలపనున్నారు. తాజా సమావేశాల్లో 14 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అటు SIRపై ఎన్డీయే ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రతిపక్షాలు సన్నద్ధం కాగా వాడీవేడిగా చర్చ జరిగే ఛాన్స్ ఉంది.


